For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma:నువ్వొద్దు..నీ వడ పావ్ వద్దు..నన్నిలా ఉండనీరాబై..!!

టీమిండియా మాజీ కెప్టెన్, 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ ఫిట్‌నెస్ మంత్రా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై వీధులంటేనే గుర్తొచ్చే 'వడాపావ్' అంటే రోహిత్‌కు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కానీ, రాబోయే న్యూజిలాండ్ సిరీస్ కోసం తనకిష్టమైన ఆ వంటకాన్ని కూడా రోహిత్ పక్కన పెట్టేశాడు.

భారత క్రికెట్ చరిత్రలో ఒకప్పుడు రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఎన్నో విమర్శలు వచ్చేవి. కానీ, గతేడాది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేలపైనే దృష్టి పెట్టినప్పటి నుండి రోహిత్ శర్మ తన బాడీని పూర్తిగా మార్చేశాడు. తాజాగా కివీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఒక సంఘటన రోహిత్ ఎంతటి కఠినమైన క్రమశిక్షణతో ఉన్నాడో నిరూపిస్తోంది.

rohit-sharma-sticks-to-no-vada-pav-rule-politely-declines-fan-s-offer-in-mumbai

"రోహిత్ భయ్యా.. వడాపావ్ కావాలా?"
ముంబైలో నెట్ ప్రాక్టీస్ ముగించుకుని వస్తున్న రోహిత్‌ను చూడగానే అభిమానులు కేరింతలు కొట్టారు. అందులో ఒక అభిమాని మరాఠీలో "రోహిత్ భయ్యా, వడాపావ్ పాహిజే కా?" (రోహిత్ భయ్యా వడాపావ్ కావాలా?) అని సరదాగా అడిగాడు. సాధారణంగా అయితే ఇలాంటి మాటలకు రోహిత్ నవ్వుతూ సమాధానం చెప్పేవాడు. కానీ, ఈసారి మాత్రం చేత్తో 'వద్దు' అని సైగ చేస్తూ సీరియస్‌గా ముందుకు సాగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్ విత్ న్యూ ఎనర్జీ" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బాడీ బిల్డర్ తరహా శిక్షణ.. 11 కిలోల బరువు తగ్గుదల!
రోహిత్ ఈ మార్పు వెనుక టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కృషి ఎంతో ఉంది.రోహిత్ గత మూడు నెలలుగా తనకిష్టమైన జంక్ ఫుడ్ మొత్తాన్ని మానేసి కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రోహిత్ దాదాపు 11 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ తరహాలో రోహిత్ జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తున్నాడని అభిషేక్ నాయర్ ఇటీవల వెల్లడించారు.

విజయ్ హజారేలో విధ్వంసం.. ఫామ్ అదిరింది!
తాజాగా ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన రోహిత్ శర్మ, తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించాడు. సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు (18 ఫోర్లు, 9 సిక్సర్లు) బాది 'హిట్‌మ్యాన్' పవర్ ఏంటో చూపించాడు. 2025 ఏడాదిని విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు (650) చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రోహిత్ ముగించాడు.

ఇదిలా ఉంటే భారత్‌ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి వన్డే జనవరి 11వ తేదీ వడోదర వేదికగా జరుగుతుండగా...రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జనవరి 14న జరుగుతుంది. ఇక చివరి వన్డే ఇండోర్‌లో జనవరి 18న జరుగుతుంది.

Story first published: Wednesday, January 7, 2026, 8:00 [IST]
Other articles published on Jan 7, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+