
పుణె విజయానికి 11 పరుగులు
'చివరి ఓవర్‌లో పుణె విజయానికి 11 పరుగుల మాత్రమే కావాలి. అప్పటికి పుణె కెప్టెన్ స్మిత్ ఇంకా అవుట్ కాకపోవడంతో మాకు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయి. స్మిత్‌ను కట్టడి చేస్తే గెలుపును సొంతం చేసుకోవచ్చనేది మా ప్రణాళిక. ఆ మేరకు చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మిచెల్ జాన్సన్‌తో చర్చించా' అని అన్నాడు.

పేస్ చేయకుండా బౌలింగ్ చేయమని చెప్పా
'సాధ్యమైనంత వరకూ స్మిత్ బంతిని పేస్ చేయకుండా విధంగా బౌలింగ్ చేయమని చెప్పా. అతను పేస్ బౌలింగ్‌ను ఎలా పేస్ చేస్తాడో మనం గతంలో చూశాం. అదే సమయంలో జాన్సన్ గాలికి వ్యతిరేక దిశలో బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో స్మిత్ ను గాల్లోకి బంతిని హిట్ చేసేలా చేయాలనుకున్నాం' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

స్మిత్ విషయంలో అలా సక్సెస్ అయ్యాం
'అప్పుడు గాల్లోకి బంతి లేపితే కచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనే అనుకున్నాం. ఆ రకంగా ముందు స్మిత్ విషయంలో సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత పూణె బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి టైటిల్ సాధించాం' అని రోహిత్ తెలిపాడు. చివరి ఓవర్లో పూణె విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి.

ఆఖరి ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన తివారీ
ఈ క్రమంలో జాన్సన్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని మనోజ్ తివారీ బౌండరీ బాదడంతో పుణె సునాయసంగా విజయాన్ని సాధిస్తుందని భావించారు. కానీ రెండో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నించిన మనోజ్ లాంగ్ ఆన్‌లో పోలార్డ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.

క్రీజులో స్మిత్
అయినప్పటికీ కెప్టెన్ స్మిత్ అర్ధసెంచరీతో క్రీజులో ఉండటంతో పూణె విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ, మూడో బంతికి స్మిత్ గాల్లోకి లేపడంతో అక్కడే ఉన్న అంబటి రాయుడు దానిని క్యాచ్ రూపంలో అందుకున్నాడు. చివరి మూడు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో వచ్చిన వాషింగ్టన్ సుందర్ బై రన్ తీశాడు.

క్రిస్టియన్ రనౌట్ అయ్యాడిలా
బ్యాటింగ్‌కు వచ్చిన క్రిస్టియన్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా రెండు పరుగులు తీసి మూడో పరుగుల తీసే ప్రయత్నంలో క్రిస్టియన్ రనౌట్ అయ్యాడు. దీంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముంబై దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











