Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మతిమరుపు ఉందా? -ఇవే తగ్గించుకుంటే మంచిది!'.. షమీ విషయంలో రోహిత్ శర్మ కౌంటర్!!

మహ్మద్ షమీ ఫామ్ విషయంలో ఓ జర్నలిస్ట్ కు గట్టి కౌంటర్ వేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. షమీకి మద్దతుగా నిలుస్తూ.. ఆటగాళ్లను జడ్జ్ చేయొద్దని చెప్పాడు. ఒకప్పుడు షమీ.. జట్టు కోసం ఎలా ఆడాడు, ఎలాంటి విజయాలు అందించాడో గుర్తు చేశాడు.

అసలు ఏం జరిగిందంటే?
గాయం, సర్జరీ కారణంగా దాదాపు ఏడాది పాటు దూరంగా ఉన్న షమీ.. ఆ తర్వాత తన ఫిట్ నెస్ ను నిరూపించుకునేందుకు దేశవాళీ క్రికెట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. అందులో కొన్ని మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేయగా.. మరి కొన్ని మ్యాచుల్లో నిరాశపరిచాడు. ఫైనల్ గా తన పెర్ ఫార్మెన్స్, ఫిట్ నెస్ తో ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

Rohit Sharma slams journalist about mohammed shami poor form question ahead of ind vs eng 1st ODI

అయితే రీసెంట్ గా ముగిసిన టీ20 సిరీస్ లో తనకొచ్చిన రెండు అవకాశాల్లో పర్వాలేదనిపించినప్పటికీ.. తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు. ఇప్పుడు వన్డే సిరీస్ సమరానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో.. షమీ ఇంటర్నేషన్ కమ్ బ్యాక్ ఇచ్చే ముందు దేశవాళీలో పూర్ పెర్ఫామెన్స్ చేశాడంటూ విలేకరి ఓ ప్రశ్న వేశాడు. దీంతో రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు.

"కొన్ని దేశవాళీ మ్యాచులను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను జడ్జ్ చేయొద్దని అన్నాడు. గత పదేళ్లలో షమీ నిలకడగా ఆడుతూ ఎన్నో విజయాలను సాధించాడని గుర్తు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో షమీ అద్భుత ప్రదర్శన చేశాడని పేర్కొన్నాడు. "షమీ గత ఏడాదిన్నార నుంచి క్రికెట్ ఆడలేదు. అయినా అంత తేలీకగా ఆటగాళ్లను అంచనా వేయొద్దు. వారిని జడ్జ్ చేయొద్దు. షమీ గత 10-12 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ.. జట్టు కోసం అద్భుత ప్రదర్శనలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో సూపర్ గా బౌలింగ్ చేశాడు. దేశవాళీలో కొన్ని మ్యాచుల్లో సరిగ్గా రాణించలేనంత మాత్రాన, అతడు పేలవ బౌలర్ గా నిర్ధారించకూడదు. షమీ ఎన్నో వికెట్లు తీశాడు. ఎన్నో మ్యాచులు గెలిచాడు. దాని గురించి ఆలోచించండి. ఇప్పుడేం జరిగిందనేదే చూస్తున్నాం. కానీ గతంలో ఏం చేశాడన్నది మర్చిపోతున్నాం. మనకు షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ ఉందనుకుంటా. వరల్డ్ కప్ లోని మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు. ఎన్నో ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు." అని షమీకి మద్దతుగా నిలిచాడు రోహిత్.

Story first published: Thursday, February 6, 2025, 13:36 [IST]
Other articles published on Feb 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+