సాహసం చేస్తుందా: తొలి టెస్టులో పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా రోహిత్?


హైదరాబాద్: ఆస్ట్రేలియాతో టెస్టు సిరిస్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో తొలి టెస్టుకి దూరమయ్యాడు.
దీంతో అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి ఆతిథ్య జట్టుతో జరగనున్న తొలి టెస్టులో అతని స్థానంలో రోహిత్ శర్మని ఓపెనర్‌గా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ, టెస్టుల్లో మాత్రం ఎప్పటి నుంచో మిడిలార్డర్‌లోనే ఆడుతున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మను ఎంపిక చేసిన సెలక్టర్లు
ఈ ఏడాది ఆరంభంలో సఫారీ పర్యటనకు ఎంపికైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్, వెస్టిండిస్‌లతో ఆడిన టెస్టు సిరిస్‌లకు రోహిత్ శర్మను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్, వెస్టిండిస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేయడంతో మరోసారి అతడికి ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు టెస్టు జట్టులో చోటు కల్పించారు.
వార్మప్ మ్యాచ్‌లో పృథ్వీ షా గాయం
ఆస్ట్రేలియా పర్యటన కోసం సెలక్టర్లు జట్టులో పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ రూపంలో ఓపెనర్లను ఎంపిక చేశారు. దీంతో రోహిత్ శర్మ మళ్లీ మిడిలార్డర్‌లోనే ఆడతాడని అభిమానులంతా భావించారు. అయితే సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో పృథ్వీ షా గాయపడటం... మురళీ విజయ్, కేఎల్ రాహుల్ పేలవ ఫామ్.. మరోసారి రోహిత్ శర్మ ఓపెనింగ్ దిగుతాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
రోహిత్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే సాహసం చేస్తుందా?
అయితే, జట్టు మేనేజ్‌మెంట్ తొలి టెస్టులో రోహిత్ శర్మను ఓపెనర్‌గా బరిలోకి దించే సాహసం చేస్తుందా? లేదో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు పృథ్వీ షా స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంటే బాగుంటుందని కూడా నెటిజన్లు సూచిస్తున్నారు.

భారత్ టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications