సతీమణితో రోహిత్ శర్మ ఫోటో: సెటైర్ వేసిన చాహల్, ఫ్యాన్స్ మండిపాటు

హైదరాబాద్: రోహిత్ శర్మ పరిచయం అక్కర్లేని పేరు. సతీమణి రితికా సాజేద్ అంటే అమితమైన ప్రేమ చూపిస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎక్కడ జరిగినా... స్టాండ్స్‌లో నుంచి రోహిత్ శర్మను ప్రోత్సహిస్తూ ఉంటుంది.
అంతేకాదు రోహిత్ ఎక్కడ క్రికెట్ ఆడటానికి వెళ్లినా.. తనతో పాటు ఆమెను అక్కడికి తీసుకెళ్తుంటాడు. ఖాళీ సమయంలో దిగిన పలు ఫోటోలను రోహిత్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై చైనామన్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ సెటైర్ వేశాడు.
సతీమణి రితికాతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసిన రోహిత్ ''ఆమె కళ్లలో నా నేడు, రేపు ఇంకా భవిష్యత్తు మొత్తం కనిపిస్తుంది'' అని క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ఫోటోలో రితికా కళ్లజోడు ధరించి ఉంది.
ఈ ఫోటోకి గాను చాహల్... రోహిత్ శర్మని ట్యాగ్ చేసి ''కళ్లు కాదు భయ్యా, గ్లాసెస్'' అని కామెంట్ చేశాడు. దీనికి రోహిత్ కూడా స్పందించాడు. ''అవును నిజమే.. కానీ గ్లాసెస్ ద్వారా కనిపిస్తుంది'' అని కామెంట్ చేశాడు. రోహిత్ శర్మపై సెటైర్ వేసినందుకు చాహల్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications