Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు డబుల్ షాక్.. విరాట్ తర్వాత రోహిత్ అవుట్!

టీ20 ప్రపంచ కప్ 2026 చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. శనివారం నుంచి చండీగఢ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో భారత జట్టు తన సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత క్రికెట్ అభిమానులకు ఓ బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదనే వార్త కలకలం రేపుతోంది.

ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తీవ్రమైన తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. వారి లభ్యత అనేది పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందే స్పష్టం చేశారు. జట్టుతో చేరడానికి ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ పరీక్షలు పాస్ కావాల్సి ఉంది. అయితే రోహిత్ శర్మ ఇంకా అక్కడ రిపోర్ట్ చేయలేదని.. హిట్ మ్యాన్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అఫ్గాన్ వన్డే సిరీస్ మొత్తానికి ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma Set to Miss Afghanistan ODI Series After Virat Kohli Double Blow for India Details

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఫామ్ అంతగా బాగోలేనప్పటికీ.. వన్డే ఫార్మాట్లో మాత్రం ఆయన రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. గతేడాది 14 వన్డేల్లో 50 సగటుతో 650 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కేవలం 61 పరుగులు మాత్రమే చేయడంతో 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి ఆయన ఫామ్‌పై కొన్ని ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కూడా గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేశాడు.

ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఒకే రకమైన తొడ గాయాల వల్ల తప్పుకోవడం టీమిండియా యాజమాన్యానికి కలవరపెడుతోంది. ఐపీఎల్ సమయంలో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ దూరం కావడం ఒకెత్తయితే.. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అందుబాటులో లేకపోవడం వన్డే సిరీస్‌లో యువ ప్లేయర్లకు పెద్ద పరీక్షగా మారనుంది. రోహిత్ శర్మ స్థానంలో జట్టును ఎవరు నడిపిస్తారు, ఓపెనర్‌గా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారనుంది.

Story first published: Thursday, June 4, 2026, 14:23 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+