Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ

Rohit Sharma set to achieve an awesome record against West Indies

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్‌తో శుక్రవారం జరిగే తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 400 అంతర్జాతీయ సిక్సర్ల మైలురాయిని చేరుకోవడానికి రోహిత్ శర్మ కేవలం ఒక సిక్స్ దూరంలో ఉన్నాడు.

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టీ20 హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ గనుక ఒక సిక్స్ బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

సిక్స్ దూరంలో

సిక్స్ దూరంలో

అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు కలిపి 400కు పైగా సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో షాహిద్ అఫ్రిది(పాకిస్థాన్), క్రిస్ గేల్(వెస్టిండిస్)లు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో 534 సిక్సర్లతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా... అఫ్రిది 476 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు.

రోహిత్ ఖాతాలో 399 సిక్సులు

రోహిత్ ఖాతాలో 399 సిక్సులు

ఇప్పుడు వీరి సరసన రోహిత్ శర్మ చేరనున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో 232 సిక్సులు, టెస్టుల్లో 52, టీ20ల్లో 115 సిక్సులతో రోహిత్ శర్మ ఖాతాలో మొత్తం 399 సిక్సులు ఉన్నాయి. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ ఏడాది ఇప్పటికే 67 సిక్సులు బాదిన రోహిత్

ఈ ఏడాది ఇప్పటికే 67 సిక్సులు బాదిన రోహిత్

రోహిత్ శర్మ ఇప్పటికే 67 సిక్సులు బాదాడు. కాగా, 2017లో 65 సిక్సులు బాదిన రోహిత్ శర్మ.... 2018లో 74 సిక్సులు బాదాడు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. డిసెంబర్ 8న జరిగే రెండో టీ20కి తిరువనంతపురం ఆతిథ్యమిస్తుండగా... డిసెంబర్ 11న జరిగే మూడో టీ20కి ముంబై ఆతిథ్యమివ్వనుంది.

టీ20 జట్ల వివరాలు:

టీ20 జట్ల వివరాలు:

భారతదేశం: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, శివం దుబే, రవీంద్ర జడేజా, సంజు సామ్సన్, లోకేష్ రాహుల్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమ్మీ

వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, షెల్డన్ కాట్రెల్, షిమ్రాన్ హెట్మీర్, జాసన్ హోల్డర్, కీమో పాల్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, ఖారీ పియరీ, నికోలస్ పూరన్, డెనేష్ రామ్‌దిన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, లెండ్ల్ సిమన్స్, కెసెరిక్ విలియమ్స్, వాల్ష్ జూనియర్

మ్యాచ్ ప్రారంభం: శుక్రవారం రాత్రి 7 గంటలకు

ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్‌లో

ఆన్ లైన్: హాట్ స్టార్‌లో

Story first published: Thursday, December 5, 2019, 19:09 [IST]
Other articles published on Dec 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+