
2092 పరుగులతో రెండో స్థానంలో రోహిత్ శర్మ
ఇప్పటివరకు భారత్ తరుపున విరాట్ కోహ్లీ 62 మ్యాచ్‌ల్లో మొత్తం 2102 పరుగులు చేశాడు. ఇక, రోహిత్ శర్మ విషయానికి వస్తే 2092 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ శర్మకు మరో 11 పరుగులు మాత్రమే కావాలి. అయితే రోహిత్ శర్మ 85 మ్యాచ్‌ల్లో ఈ పరుగులు సాధిస్తే కోహ్లీ మాత్రం 62 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం.

టీ20ల్లో రెండు వేల పరుగులు చేసిన రోహిత్ శర్మ
ఈ ఏడాది జులైలో బ్రిస్టల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో రోహిత్ శర్మ(100 నాటౌట్) రాణించడంతో టీ20ల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీ20ల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా చూస్తే భారత్ తరుపున ఈ మైలురాయిని అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడు
ఇక, మహిళల్లో మిథాలీ రాజ్ సైతం ఈ మైలురాయిని అందుకుంది. టీ20ల్లో రోహిత్ శర్మ హిట్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మనే కావడం విశేషం. అంతేకాదు వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడు కూడా రోహితే.

టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ
2014లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక, టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌కు చెందిన కోలిన్ మున్రోలు మాత్రమే టీ20ల్లో మూడు సెంచరీలు సాధించారు.

లక్నో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టీ20
కాగా, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన టీ20లో రోహిత్ శర్మ(6) పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 లక్నోలో కొత్తగా నిర్మించిన ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతర్జాతీయ స్టేడియం'లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరిస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ ఊవిళ్లూరుతోంది.


Click it and Unblock the Notifications












