Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి.. మాతో ఉంటే తప్పేంటి: రోహిత్

Rohit Sharma Sends Out Strong Message To Media ! || Oneindia Telugu
Rohit Sharma sends out strong message: ‘Talk about me but don’t drag my family’

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ల కుటుంబాల గురించి గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆ వివాదంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి. మాతో ఉంటే తప్పేంటి అని రోహిత్ ప్రశ్నించాడు. అసలు తమ ఫ్యామిలీల గురించి మీడియా ఎందుకు ఆసక్తి. ఏమైనా ఉంటే తమ గురించి మాత్రమే రాయాలని, ప్రతీ విషయంలో కుటుంబాన్ని లాగడం మంచి పద్ధతి కాదని ధ్వజమెత్తాడు.

మాతో ఉంటే తప్పేంటి:

మాతో ఉంటే తప్పేంటి:

విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న రోహిత్ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఈ విలువైన సమయాన్ని తన కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే ప్రపంచకప్‌ సమయంలో చోటు చేసుకున్న వివాదం గురించి సోమవారం ఓ ఇంటర్వ్యూలో రోహిత్‌ మాట్లాడాడు. 'ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి. మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మాతో ఉంటే తప్పేంటి. మా కుటుంబ సభ్యులకు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ రోజులు మాతో ఉన్నారని వార్తలు రాశారు. మా ఫ్యామిలీల గురించి మీకు ఎందుకు' అని రోహిత్ మండిపడ్డాడు.

నా వరకే పరిమితం చేయండి:

నా వరకే పరిమితం చేయండి:

'మా కుటుంబల గురించి వార్తలు రాస్తున్నారని స్నేహితులు చెబితే నవ్వుకున్నా. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ నా గురించి ఏమైనా రాయాలనుకుంటే.. దాన్ని నా వరకే పరిమితం చేయండి. ఫలానా వాళ్లు మా గురించి ఏదో అంటున్నారని రాస్తే దాన్ని మేము లెక్కచేయాల్సిన పనిలేదు. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ ఇదే విషయంపై మాట్లాడాడు. కుటుంబాలు అనేవి మా జీవితంలో కూడా చాలా ముఖ్యమైనవే. ఇది తెలుసుకోండి' అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

ఎంతో సంతోషంగా ఉన్నా:

ఎంతో సంతోషంగా ఉన్నా:

'ఆలోచనల పరంగా నేను కాస్త విభిన్నం. నా భార్య (రితిక), కూతురు (సమైరా)తో జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నా. ఎవరో ఏదో మాట్లాడుతున్నారన్న బెంగ లేదు. నా కుటుంబం ఎనలేని ప్రేమ, ఆప్యాయత నాపై చూపిస్తుంటే.. ఎవరో అన్న మాటల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చెడు మాట్లాడుకున్నా పట్టించుకునే స్థాయిని దాటిపోయా. అవి నాపై ఎలాంటి ప్రభావం చూపవు' అని రోహిత్ పేర్కొన్నాడు.

జయసూర్య రికార్డు బద్దలు:

జయసూర్య రికార్డు బద్దలు:

గతేడాది మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా మొత్తం 2,442 పరుగులు చేసిన 'హిట్‌మ్యాన్' అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న లంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య రికార్డు బద్దలు కొడ్తాడు. టెస్టుల్లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలతో చోటు ఖాయం చేసుకున్నాడు.

Story first published: Tuesday, January 7, 2020, 11:13 [IST]
Other articles published on Jan 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+