
హైదరాబాద్: మొహాలి వేదికగా జరుగుతున్న భారత్-శ్రీలంక రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ధన్ దనా దన్ మంటూ డబుల్ సెంచరీ కొట్టాడు. క్రితం మ్యాచ్ లో చవిచూసిన ఘోర వైఫల్యం ప్రభావమో.. పెళ్లి రోజు ఆనందమో.. బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. భారత్ స్కోరు 393 చేసి ప్రత్యర్థికి భారీ టార్గెట్‌ను కళ్ల ముందుంచాడు.
కసి తీరింది.:
శ్రీలంక బౌలర్ లక్మల్‌పై కసి తీర్చుకున్నాడు. తొలి వన్డేల్లో 4 వికెట్లతో భారత ఘోర పరాభావాన్ని శాసించిన లక్మల్‌కు ఈ మ్యాచ్‌లో రోహిత్ తన బ్యాట్‌తో సమాదానం చెప్పాడు. లక్మల్ ధర్మశాల మ్యాచ్‌లో రోహిత్‌ను కేవలం 2 పరుగులకే పరిమితం చేసి పెవిలియన్‌కు పంపించాడు. అది మనసులో పెట్టుకునో ఏమో వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాది రికార్డు నమోదు చేశాడు.
లక్మల్ వేసిన 43 ఓవర్‌లో .. 26
రెండో వన్డేల్లో లక్మల్ వేసిన 43 ఓవర్‌లో రోహిత్ వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాది లక్మల్‌కు చుక్కలు చూపించాడు. లక్మల్ వేసిన ఓ వైడ్‌ను కలుపుకొని ఒకే ఓవర్‌లో భారత్‌కు 26 పరుగులు కలిశాయి.
9 బంతులు.. 7 సిక్సులు
44 ఓవర్లో వచ్చిన ప్రదీప్ బౌలింగ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న రోహిత్ రెండు సిక్సులు, పెరీరా బౌలింగ్‌లో మరో సిక్స్ బాదాడు. దీంతో రోహిత్ వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాదినట్లైంది. 43.2 వ బంతి నుంచి 45.1వరకు వరుసగా 7 సిక్సులు బాదాడు.
వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్
ఇప్పటికే రోహిత్ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. తాజా డబుల్‌తో వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు దాటాయి. ఈ రికార్డుతో 3 డబుల్ సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా నమోదయ్యాడు. ఇక వన్డే చరిత్రలో మెత్తం 7 డబుల్ సెంచరీలు నమోదు కాగా రోహిత్‌వే 3 డబుల్ సెంచరీలు.
తొలి డబుల్ సెంచరీ:
రోహిత్ తొలి డబుల్ సెంచరీ (209)2013లో ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో నమోదు చేశాడు.
రెండో డబుల్ సెంచరీ
శ్రీలంకపై రెండో డబుల్ సెంచరీ(264)ను 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో సాధించాడు.
మూడో డబుల్ సెంచరీ (208) 2017లో మొహాలీ స్టేడియంలో సాధించాడు.
మిగతా నాలుగు డబుల్ సెంచరీలు సచిన్ టెండూల్కర్(200) , సెహ్వాగ్(219), క్రిస్‌గేల్ (215) మార్టిన్‌గప్టిల్ (237)ల పేరిట ఉన్నాయి.
* శ్రీలంకపై అత్యధిక పరుగుల చేసిన తొలి కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు
* వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సెహ్వాగ్(219) పేరిట ఉంది. 2011 డిసెంబర్ 8న ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌పై సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌కు సెహ్వాగ్ కెప్టెన్సీ వహించడంతో ఈ రికార్డు తన సొంతమైంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.