కుర్రాళ్లకు పాఠాలు చెబుతున్న హిట్‌మ్యాన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు గాయపడ్డ రోహిత్ శర్మ ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ ఎడమ కాలు గాయం తిరగబెట్టిన సంగతి తెలిసిందే. అతని ఎడమ తొడ నరం పట్టేసింది. దీంతో రోహిత్ కోలుకోవడానకి 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయిన రోహిత్ ఎన్‌సీఏలో ఫిజియోథెరపీల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. రోహిత్‌తోపాటు ఇదివరకే గాయపడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు.

కుర్రాళ్లకు రోహిత్ పాఠాలు
ఎన్‌సీఏ శిబిరంలో ఈ నెల 23 నుంచి యూఏఈలో జరిగే ఆసియా కప్‌నకు టీమిండియా అండర్-19 జట్టు కూడా శిక్షణ పొందుతుంది. దీంతో హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ అండర్-19 క్రికెటర్లను కలిశాడు. వాళ్లతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వారికి హిట్‌మ్యాన్ కొన్ని క్రికెట్ పాఠాలు చెప్పాడు. ఆటలో సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు పలు విలువైన సూచనలు ఇచ్చాడు. వారితో అనేక విషయాలు పంచుకున్నాడు. కాగా మెగా టోర్నీకి ముందు రోహిత్ సలహాలు యువ క్రికెటర్లకు ఉపయోగపడతాయని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ సందర్భంగా అండర్-19 ఆటగాళ్లకు రోహిత్ పాఠాలు చెబుతున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. వాటిని వెల కట్టలేని పాఠాలు అని పేర్కొంది.

ముంబైని ఐదు సార్లు చాంపియన్ చేసిన రోహిత్
కాగా హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. వైట్ బాల్ క్రికెట్‌కు ప్రస్తుతం రోహితే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు తన నాయకత్వంలో టీమిండియాను రోహిత్ సమర్థవంతంగా నడిపించాడు. ఇక ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహిస్తున్న హిట్‌మ్యాన్ రికార్డు స్థాయిలో ఆ జట్టును 5 సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

నేడు ఎన్‌సీఏలో చేరిన రోహిత్
ఇక గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన రోహిత్‌శర్మ.. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నేడు చేరాడు. రోహిత్ కోలుకోవడనాకి 3 నుంచి 4 వారాల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే రోహిత్‌తోపాటు కోలుకుంటున్న జడేజా కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications