న్యూజిలాండ్ బలం, బలహీనతలు తెలుసు: రోహిత్ శర్మ

WTC Final Day 2: Rohit Sharma's Strategy VS NZ Bowlers ప్రత్యర్థి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

సౌతాంప్టన్: న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో పోటీపడుతున్నప్పుడు తమ జట్టు సింపుల్‌గా.. రియలిస్టిక్‌గా ముందుకెళ్తే మంచి ఫలితం వస్తుందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ఇక ఈ మెగా ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలవ్వాల్సిన ఈ ఫైనల్ మ్యాచ్‌కు భారీ వర్షం అడ్డుపడింది. దీంతో తొలి రోజు ఆట పూర్తిగా రద్దయింది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రోహిత్ ప్రత్యర్థి జట్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కివీస్ బౌలర్ల బలం, బలహీనత తెలుసు..

కివీస్ బౌలర్ల బలం, బలహీనత తెలుసు..

‘నేను వీళ్లతో(కివీస్ బౌలర్లు) ఆడాను. వాళ్ల బలం, బలహీనతలు నాకు తెలుసు. ఇక్కడి కండీషన్స్, టీమ్ సిచ్యువేషన్, మేం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నామా, సెకండ్ చేస్తున్నామా అన్న దానిపై సంబంధం లేకుండా వాళ్ల నుంచి సవాల్ ఉంటుంది. అయితే దీని గురించి మేం అతిగా ఆలోచించకూడదు. ఓ బలమైన జట్టుతో పోటీ పడుతున్నప్పుడు అన్ని విషయాలను సింపుల్‌గా, రియలిస్టిక్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం'అని రోహిత్ పేర్కొన్నాడు.

ప్రతి రోజు ఓ కొత్త సవాల్..

ప్రతి రోజు ఓ కొత్త సవాల్..

షార్ట్ ఫార్మాట్‌లో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హిట్ మ్యాన్.. ప్రతీ రోజు సవాల్ విసిరే లాంగ్ ఫార్మాట్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ‘ఈ ఫార్మాట్‌లో మనకు ఐదు రోజులూ చాలెంజ్ ఎదురవుతుంది. నాకు తెలిసి మరెక్కడా ఇలా ఉండదు. ప్రతి రోజు ఓ కొత్త సవాల్ వస్తుంది. లాంగ్ ఫార్మాట్‌లో ఓపిక అవసరం. అలాగే డిఫరెంట్ కండీషన్స్‌లో ఆడాల్సి ఉంటుంది. ఇదంతా అంత ఈజీకాదు. ఫీల్డ్‌లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఐదో రోజులు మెంటల్‌గా ఫ్రెష్‌గా ఉండాలి. అలాగే, ఈ సవాళ్లను అంగీకరించి, వాటిని అధిగమించడానికి ఫిజికల్‌గా కూడా ఫిట్‌గా ఉండాలి'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

 రోహిత్‌కు కోహ్లీ బ్యాటింగ్ టిప్స్..

రోహిత్‌కు కోహ్లీ బ్యాటింగ్ టిప్స్..

శుక్రవారం ఆటకు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన హిట్ మ్యాన్ రోహిత్‌కు.. విరాట్ బంతితో త్రోడౌన్స్ చేశాడు. రకరకాల బంతులు వేస్తూ టీమ్‌మేట్‌కు సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఈ లాంగ్ ప్రాక్టీస్ సెషన్‌‌లో ఇద్దరూ చాలా సేపు బ్యాటింగ్‌పై డిస్కషన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే క్రమంలో రోహిత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే ఇంగ్లండ్ గడ్డపై మాత్రం 2014లో ఏకైక టెస్ట్ మాత్రమే ఆడిన హిట్ మ్యాన్ 34 రన్స్ మాత్రమే చేశాడు. ఈ చాంపియన్‌షిప్‌లో హిట్ మ్యాన్ 11 టెస్ట్‌లు ఆడి 64.37 యావరేజ్‌తో 1030 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 19, 2021, 13:10 [IST]
Other articles published on Jun 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X