
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ పేసర్ అర్షదీప్ సింగ్ క్యాచ్ మిస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను తన డిస్సాపాయింట్‌మెంట్ నుంచి వెంటనే బయటపడ్డాడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్ష్‌దీప్ సింగ్ మెంటాలిటీ పట్ల ప్రశంసలు కురిపించాడు. అర్షదీప్ సింగ్.. పాక్ మ్యాచ్‌లో ఆసిఫ్ అలీ క్యాచ్‌ను వదిలివేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్‌లో అర్షదీప్ సింగ్ కూల్‌గా బౌలింగ్ చేశాడు. అయితే అతను ఏడు పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు. పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం అర్షదీప్ సింగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇకపోతే మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చివరి ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ మరోసారి తన మార్క్ చూపించాడు. కేవలం 7పరుగులను డిఫెండ్ చేసే క్రమంలో కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. అయితే పంత్ కీపింగ్, అర్షదీప్ ఓవర్ త్రో వల్ల మ్యాచ్ చేజారింది. మరో బంతి మిగిలి ఉండగానే శ్రీలంక గెలుపొందింది. ఈ ఓటమితో భారత్ సూపర్ 4 స్టేజ్‌లో వరుసగా రెండో మ్యాచ్ ఓటమిపాలయింది.
ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో జరిగిన తన క్యాచ్ డ్రాప్ నుంచి పుంజుకోవడానికి అర్షదీప్ సింగ్‌కు చాలా బలమైన మనస్తత్వం ఉందని రోహిత్ శర్మ ప్రశంసించాడు. అతను చివరి రెండు ఓవర్లలో బాగా బౌలింగ్ చేశాడని చెప్పాడు. 'అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా నిరాశ చెందాడు, అయితే పాకిస్థాన్‌తో జరిగిన ఆఖరి ఓవర్‌లో అతని ఆత్మవిశ్వాసాన్ని గనుక మీరు చూసినట్లయితే.. అతను సరైన యార్కర్లు వేశాడు. అతను ఆసీఫ్‌ను అవుట్ చేసాడు. అతను మానసికంగా బలంగా లేకపోతే ఆ వికెట్ పడేది కాదు ఆ మ్యాచ్ అంత క్లోజ్‌గా సాగేది కాదు. కానీ అతను ఎంతో కాన్ఫిడెంట్‌గా బంతిని అందుకున్నాడు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కూడా చూసుకోండి. అతను చివరి రెండు ఓవర్లలో బాగా బౌలింగ్ చేశాడు.' అని రోహిత్ శర్మ అన్నాడు.
అర్షదీప్ సింగ్ చాలా ఆత్మవిశ్వాసం ఉన్న ప్లేయర్. అతని ఆట పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ చాలా సంతోషంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. 'అతను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న కుర్రాడు, అందుకే అతను ఇక్కడ బెంచ్ మీద కూర్చున్న చాలా మంది ఆటగాళ్ల కంటే అతను ముందున్నాడు. కెరీర్ ప్రారంభంలో అతనిలాంటి కుర్రాడిని నేను చూడలేదు. కెప్టెన్‌గా, కోచ్‌గా అతను తన ఆటను ఎలా స్వీకరిస్తాడో, బంతితో తన సత్తాను ఎలా సాగిస్తున్నాడో మాకు అర్థమవుతుంది. ఆ విషయంలో మాకు చాలా సంతోషంగా ఉంది' అని శర్మ చెప్పాడు.