Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా టూర్‌కి సతీమణులతో స్టార్ క్రికెటర్లు

హైదరాబాద్: ఎప్పటి నుంచో అటు క్రికెట్ అభిమానులు ఇటు సీనియర్ ఆటగాళ్లు ఎదురుచూసిన దక్షిణాఫ్రికా పర్యటనకు సమయమొచ్చింది. కాగా మన భారత ఆటగాళ్లు భార్యలతో సైతం విమానాలెక్కాశారు. ఆట ఆడి గెలచిరమ్మని పంపిస్తే భార్యలతో ప్రియురాళ్లతో వెళ్లి ఆటను ఓడిపోయిన సందర్భాలున్నాయంటూ పలువురు విమర్శకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ:

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ:

కొత్త జంట విరాట్ కోహ్లీ, అనుష్కల హనీమూన్ పూర్తవలేదేమో అని వీరి ప్రయాణం గురించి కొందరు వెక్కిరిస్తున్నారు. ఇదంతా వట్టిదే అనుష్క నూతన సంవత్సర వేడుకలకోసం అక్కడికి వెళ్లింది. అది పూర్తవగానే తిరిగొచ్చేస్తుందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.

ఆట నా రక్తంలో..

ఈ వ్యాఖ్యాలపై ఘాటుగానే స్పందించిన కోహ్లీ "ఆట నా రక్తంలోనే ఉంది. నేను మెంటల్ ఫిక్స్ అయ్యే వెళ్తున్నాను. దీని గురించి ఎవ్వరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసర్లేదంటూ" బల్ల గుద్దినట్లు చెప్పాడు.

రోహిత్ శర్మ రితిక:

ట్రిపుల్ డబుల్ సెంచరీల యోధుడు రోహిత్ శర్మ కూడా తన భార్యను తీసుకుని చెక్కేశాడు. విదేశాలలో తిరుగుతూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తన భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అన్ని పూసగుచ్చినట్లు కామెంట్ల రూపంలో రాసి మరి పోస్ట్ చేస్తున్నాడు.

డబుల్ సెంచరీ

డబుల్ సెంచరీ

ఇంతకుముందు శ్రీలంక‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తన భార్య స్టేడియంలో ఉండగా రోహిత్ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున వాళ్ల పెళ్లి రోజు కావడం విశేషం.

శిఖర్ ధావన్, ఆయేషా

శిఖర్ ధావన్, ఆయేషా

భారత జట్టు బ్యాటింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన కాలి చీలమండకు గాయమైందని ముంబైలో చికిత్స చేయించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు ప్రయాణమయ్యాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు విమానం ఎక్కాల్సి ఉంది.

ఒక్కడే వెళ్లాడు

ఒక్కడే వెళ్లాడు

దుబాయ్ చేరుకున్న ధావన్ కుటుంబాన్ని ఎమిరేట్స్ వారు పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు లేనందుకు ఆపేశారు. దీంతో అవి తెచ్చేంతవరకు అక్కడే ఉండాల్సి రావడంతో ధావన్ ఒక్కడే దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 30, 2017, 15:53 [IST]
Other articles published on Dec 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+