Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడు బ్యాట్‌ప‌ట్టి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే నాతో పోటీనా: రోహిత్

Rohit Sharmas Savage Response to Rishab Pants Biggest Six Challenge Has Cricket Fans in Splits

ముంబై: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఒకవైపు ఎలాంటి క్రికెట్ టోర్నీలు లేకపోడం, మరోవైపు ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్‌ వాయిదా పడడంతో దేశంలో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా క్రికెటర్లంతా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొంద‌రు జిమ్‌లో వ‌ర్కౌట్లు చేస్తుంటే.. మ‌రికొంద‌రు త‌ల్లిదండ్రుల‌కు ఇంటి ప‌నిలో సాయం చేస్తున్నారు. అయితే టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం సోషల్‌ మీడియాలో పలువురు క్రికెటర్లతో లైవ్‌చాట్‌ చేస్తున్నాడు.

బ్యాట్‌ప‌ట్టి ఏడాది కాలేదు

బ్యాట్‌ప‌ట్టి ఏడాది కాలేదు

ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్‌తో లైవ్‌చాట్‌ చేసిన రోహిత్‌ శర్మ.. తాజాగా టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి లైవ్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా బుమ్రా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు హిట్‌మ్యాన్ స‌మాధానాలిచ్చాడు. 'భారీ సిక్స‌ర్లు బాద‌డంలో యువ బ్యాట్స్‌మన్‌ రిష‌బ్ పంత్.. నీతో పోటీ పెట్టుకోవాల‌నుకుంటున్నాడు' అని రోహిత్‌ను బుమ్రా ప్ర‌శ్నించాడు. అందుకు హిట్‌మ్యాన్ అదిరే పంచ్ ఇచ్చాడు. 'అతను నాతో పోటీ పడాలనుకుంటున్నాడా?. బ్యాట్‌ప‌ట్టి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే నాతో పోటీనా' అని అదిరే జవాబిచ్చాడు.

కోపంగా ఉన్నావా? పంత్

కోపంగా ఉన్నావా? పంత్

ప్రస్తుతం హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ చేసిన లైవ్‌చాట్‌ సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అయింది. అయితే రిషబ్ పంత్‌ను నెటిజ‌న్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. 'రిషబ్ పంత్‌కు రోహిత్ శర్మ అదిరే పంచ్‌ ఇచ్చాడు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా... 'హిట్‌మ్యాన్‌తో సిక్సర్ల పోటీనా?.. కోపంగా ఉన్నావా? పంత్' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. ఈ లైవ్‌చాట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. అనేక లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

హిందీలోనే మాట్లాడతాం

హిందీలోనే మాట్లాడతాం

లైవ్‌చాట్‌లో బుమ్రాతో రోహిత్ హిందీలో మాట్లాడుతుండగా.. కొందరు అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్‌.. అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని చెబుతున్నారని, తాము భారతీయులం అయినందున హిందీలోనే మాట్లాడతామని ఆగ్రహం వ్యక్తం చేసాడు. టీవీ ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్‌లోనే మాట్లతానని, ప్రస్తుతం ఇంట్లో ఉన్నందున హిందీలో మాట్లాడుతా అని అభిమానులకు ధీటుగా జవాబిచ్చాడు.

కరోనా కోసం రోహిత్ భారీ విరాళం

కరోనా కోసం రోహిత్ భారీ విరాళం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో​ రోహిత్ శర్మ కూడా భాగం అయిన విషయం తెలిసిందే. మొత్తం రూ.80లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.45 లక్షలు.. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు.. ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో రూ.5లక్షలు అందించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. రోహిత్ సాయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసాడు.

Story first published: Thursday, April 2, 2020, 15:17 [IST]
Other articles published on Apr 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+