'వాళ్లిద్దరు కుదురుదుకుంటే జట్లు గెలిచినట్లే'

హైదరాబాద్: డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్ 11 బరిలోకి దిగిన ముంబై జట్టు వరుస వైఫల్యాల అనంతరం నాలుగో మ్యాచ్‌లో విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. బెంగుళూరు జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చిన ముంబై జట్టు విజయాన్ని పొంది నాలుగు రోజుల అనంతరం ఆదివారం రాజస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది.

రోహిత్‌కు అడ్డుకట్ట వేయడం అసాధ్యమే:
రాజస్తాన్ రాయల్స్ ఆ జట్టులో ప్రారంభం నాటి ఊపు లేదు. ఇలాంటి ఒడిదొడుకులే టోర్నీని ఆసక్తికరంగా మారుస్తాయి. మ్యాచ్ రోజు ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడంతో ముంబై గత మ్యాచ్‌లో బెంగళూరుకు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. బంతిని అవలీలగా, నమ్మశక్యం కాని రీతిలో స్టాండ్స్‌లోకి కొట్టే రోహిత్‌కు అడ్డుకట్ట వేయడం అసాధ్యమే.

ముంబైకి ఫినిషర్ల లోటు:
రోహిత్ జోరు మీదుంటే జట్టు స్కోరు పరిగెత్తడాన్ని చూడగలం. ఎవిన్ లూయీస్ అద్భుత ఆరంభాలు ఇస్తున్నా, ముంబైకి ఫినిషర్ల లోటు కనిపిస్తోంది. పొలార్డ్‌తో పాటు పాండ్యా సోదరులు హార్దిక్, కృనాల్ పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. బెంగళూరుపై కొంత ఇబ్బంది పడినా మయాంక్ మార్కండే తొందరగానే కుదురుకున్నాడు. ఫీల్డింగ్ పరిమితులు తొలగాక అతడు మరోసారి కీలకంగా మారగలడు. బుమ్రా గాడిన పడే ప్రయత్నంలో ఉండగా, ముస్తఫిజుర్ రెండేళ్ల క్రితం నాటి స్థాయిలో లేడు.

ఆదివారం హైదరాబాద్‌తో చెన్నై:
వాట్సన్ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ తనదైన శైలిలో . ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌పైనా ఇదే విధంగా ఆడగలమని ఆశాభావంతో ఉంది. గేల్ దెబ్బతో తొలి ఓటమిని మూటగట్టుకున్న సన్‌రైజర్స్... తమ కీలక ఆటగాడు శిఖర్ ధావన్ ఫిట్‌నెస్ సాధించాలని కోరుకుంటోంది. దూకుడుగా ఆడే అతడు ఫామ్‌లో ఉన్నాడు.

తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే రకం:
'లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే రకం.' సునీల్ గవాస్కర్ అన్నాడు. గేల్ సునామీ నుంచి తేరుకుని తను మరింత బలంగా వస్తాడు. ఇప్పుడు మళ్లీ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారమే కెప్టెన్లు తుది జట్టును ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications