For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్రెండింగ్‌.. రోహిత్‌ శర్మ #10YearChallenge

IPL 2019: Rohit Sharma's 10 Year Challenge Photo Trending On Social Media!! | Oneindia Telugu
Rohit Sharmas 10 year challenge photo trending on Social media

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో #10YearChallenge (టెన్ ఇయర్ ఛాలెంజ్) ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరు పదేళ్ల కిందట ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో వారి ఫొటోలను షేర్ చేసి చూపిస్తున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా మినహాయింపేమీ కాదు. ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో 2009 - 2019 నాటి ఫొటోలను పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ , ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు సంబంధించిన #10YearChallenge ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2009 ఐపీఎల్‌లో అప్పటి దక్కెన్ చార్జెస్ జట్టుకు ఆడిన రోహిత్.. 'ఎమెర్జింగ్‌ ప్లేయర్‌' అవార్డు అందుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉండి ట్రోఫీ అందుకున్నాడు. 2009, 2019 ఫొటోలను జత చేసి షేర్‌ చేయడంతో.. ఆ ఫొటో ట్రెండింగ్‌లో ఉంది.

Rohit Sharmas 10 year challenge photo trending on Social media

ఈ ఫొటోను అభిమానులు తెగ షేర్ చేస్తూ.. తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'ఐ లవ్ రోహిత్ శర్మ' అని ఓ అభిమాని పోస్ట్ చేసాడు. 'రోహిత్ హిట్ మ్యాన్ మాత్రమే కాదు మంచి కెప్టెన్' అని మరో అభిమాని పోస్ట్ చేసాడు. 'సచిన్ రిటైర్ అయ్యేప్పుడు.. కోహ్లీ, రోహిత్ టాలెంటెడ్ ప్లేయర్స్ అని చెప్పాడు', 'రోహిత్ గొప్ప కెప్టెన్, బ్యాట్స్‌మన్‌' అని అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. గతంలో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఫొటో కూడా ట్రెండ్ అయింది.

Story first published: Wednesday, May 15, 2019, 15:34 [IST]
Other articles published on May 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+