రనౌట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ గిల్.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఆఫ్ఘనిస్తాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ.. మ్యాచ్ ముగిసిన అనంతరం అందరి దృష్టి రోహిత్ శర్మ రనౌట్ అంశంపైనే నిలిచిది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన చిన్నపాటి పారపాటు వల్ల రోహిత్ శర్మ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ రనౌట్ వివాదంపై నవ్వుతూ స్పందించి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని తేలికపరిచాడు.
అసలేం జరిగిందంటే?
భారత్ ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ఘన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్‌పర్ వేసిన బంతిని రోహిత్ శర్మ మిడ్ వికెట్ వైపు ఆడి వేగంగా సింగిల్ తీసేందుకు పరిగెత్తాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ కూడా మొదట రన్ తీసేందుకు ముందుకు వచ్చాడు. కానీ కొన్ని అడుగులు వేసిన తర్వాత అకస్మాత్తుగా వద్దంటూ రోహిత్ శర్మను వెనక్కి పంపేశాడు. అప్పటికే రోహిత్ శర్మ క్రీజు దాటి చాలా మందుకు వచ్చేయడంతో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఇచ్చిన త్రోను అందుకున్న వికెట్ కీపర్ బెయిల్స్ ఎగరగొట్టాడు. దీంతో రోహిత్ శర్మ 16 పరుగుల వద్ద తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు.

రోహిత్ శర్మ రియాక్షన్‌ను బయటపెట్టిన గిల్
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఈ రనౌట్ గురించి ప్రశ్నించగా.. గిల్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. "రోహిత్ భాయ్ అప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి రనౌట్ రీప్లే చూసేశాడని నాకు తెలుసు. నేను ఆయనతో మాట్లాడినప్పుడు.. 'ఏం పర్లేదు, అంతా బానే ఉంది' అని రోహిత్ చెప్పాడు. అయినా అఫ్గానిస్థాన్‌తో ఆడిన గత టీ20 మ్యాచ్‌లో కూడా ఆయన ఇలాగే రనౌట్ అయ్యాడు కదా" అంటూ శుభ్‌మన్ గిల్ సరదాగా కామెంట్ చేశాడు. గిల్ ఇచ్చిన ఈ సమాధానంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ విషయమై ఎలాంటి గొడవలు లేవని, అంతా సవ్యంగానే ఉందని స్పష్టమైంది.
ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ విజయం
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 194 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులతో వీరవిహారం చేశాడు. ఒకానొక దశలో మ్యాచ్ భారత్ చేతుల్లోంచి చేజారిపోతుందనిపించినా.. భారత బౌలర్లు పునరాగమనం చేశారు. అనంతరం అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(84*) ఆడిన ఇన్నింగ్స్ సాయంతో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగేట్రం చేసిన యువ బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు తీసి అఫ్గానిస్థాన్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications