
గాయం ఎలా జరిగింది?
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఎడ్జ్ తీసుకొని తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నంలో అది అతని బొటనవేలిని బలంగా తాకింది. ఈ క్రమంలో అతను క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటన వేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రిలో స్కానింగ్ కోసం పంపించారు. అతని చేతికి కుట్లు కూడా పడినట్లు సమాచారం. ఆ తర్వాత జట్టు ఓటమి అంచుల్లో నిలిచినప్పుడు గాయం ఉన్నా కూడా బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. దీంతో అతని గాయం మరింత పెద్దది అయిందని తెలుస్తోంది.

రెండో టెస్టుకు దూరం?
గాయంతో ముంబై చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకున్నాడు. మూడో వన్డేలో కూడా ఆడలేదు. అలాగే తొలి టెస్టుకు కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో యువ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికీ రోహిత్ గాయం పూర్తిగా మానలేదని తెలుస్తోంది. ఇంకా అతని బొటన వేలు నొప్పిగానే ఉందని, గట్టిగా పట్టేసినట్లుగా ఉందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగోలా రోహిత్ బ్యాటింగ్ చేసినా.. ఫీల్డింగ్ సమయంలో ఈ గాయం మరింత పెద్దది అయ్యే ప్రమాదం ఉందట. అందుకని రోహిత్ విషయంలో ఇంత రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని బీసీసీఐ అనుకుంటోంది.

రీఎంట్రీ అప్పుడేనా?
రోహిత్ రెండో టెస్టుకు దూరమైనట్లు అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. బీసీసీఐ దాదాపు ఇదే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో రెండో టెస్టులో కూడా తాత్కాలిక సారధి కేఎల్ రాహులే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దీంతో తొలి టెస్టులో మొదటి టెస్టు సెంచరీ సాధించిన శుభ్‌మన్ గిల్‌కు రెండో టెస్టులో కూడా అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌కు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ అనుకుంటోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక పర్యటన నుంచి మళ్లీ జట్టుతో రోహిత్ కలుస్తాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ సిరీస్ జనవరి 3 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే రెండో టెస్టుపై ఇంకా బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.


Click it and Unblock the Notifications












