న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, రితిక సజ్‌దేహ్ దంపతులు హానీమూన్ కోసం యూరప్ వెళ్లారు. గత ఏడాది డిసెంబర్ నెలలో వీరు పెళ్లి చేసుకున్నారు. వరుస టోర్నమెంట్లలో తీరిక లేకుండా గడిపిన రోహిత్ శర్మకు ఇప్పుడు తీరిక దొరికింది.
దీంతో, అతను హానీమూన్ కోసం యూరప్‌లోని కాప్రికు వెళ్లాడు. తన హానీమూన్‌కు సంబంధించిన ఫోటోలను, విషయాలను అతను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

ఎట్టకేలకు హానీమూన్‌కు సమయం చిక్కిందని, మేం ప్రయాణించిన ఎయిర్ వేస్ విమానంలో సదుపాయాలు బాగున్నాయని, దూరపు ప్రయాణం చేసి రోమ్‌లో దిగామని, ఎయిర్ వేస్ సిబ్బంది సేవలతో అలసట తెలియలేదని పేర్కొన్నాడు. కాప్రి అందాలు తమను మంత్రముగ్ధులను చేస్తున్నాయని ట్వీట్ చేశాడు.