ఆరోజు రితికా అందుకే ఏడ్చింది: రోహిత్

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి లాక్‌డౌన్‌తో భారత క్రికెటర్లు తమ ఇళ్లలో ఉంటూ తోటి ఆటగాళ్లు నిర్వహిస్తున్న లైవ్ చాట్‌లో పాల్గొంటున్నారు. పలువురు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు, చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ.. గత జ్ఞాపకాలను, కొత్త విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బీసీసీఐ టీవీలో నిర్వహించిన 'ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' షోలో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని మధురానుభూతులను రోహిత్ పంచుకున్నాడు.

మొహాలీ స్టాండ్స్‌లో కన్నీళ్లు
వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. రోహిత్ తన మూడో డబుల్ సెంచరీని గుర్తు చేసుకుంటూ.. తన భార్య రితికా మొహాలీ స్టాండ్స్‌లో కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణాన్ని హిట్‌మ్యాన్ చాట్ షోలో వెల్లడించాడు. 2017లో భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే మొహాలిలో జరిగింది.

చేతికి దెబ్బ తగిలిందేమోనని
'ఆ మ్యాచ్‌లో నేను 195 పరుగుల వద్ద ఉన్నప్పుడు సింగిల్ తీయాల్సి వచ్చింది. సింగల్ కోసం పరిగెత్తిన నేను డైవ్ చేశాను. ఇంకా నేను డబుల్ సెంచరీ సాధించకముందే..196 పరుగుల వద్ద ఉన్నప్పుడు రితికా భావోద్వేగానికి లోనైంది. ఎందుకు ఏడ్చావు అని నేను ఆమెను అడిగా. పరుగు తీస్తున్న క్రమంలో డైవ్ చేయడంతో చేతికి దెబ్బ తగిలిందేమోనని భావోద్వేగానికి లోనయ్యానంటూ రితికా చెప్పింది. అంతేగాక ఆరోజు చేసిన డబుల్ సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే నేను డబుల్ సెంచరీ చేసిన రోజే మా పెళ్లిరోజు కాబట్టి' అని మయాంక్‌తో రోహిత్ చెప్పుకొచ్చాడు.

వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు
వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డు నెలకొల్పిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ సాధించిన మూడు డబుల్ సెంచరీల్లో రెండు శ్రీలంకపై (2014,2017) సాధించగా.. ఒకటి మాత్రం ఆస్ట్రేలియాపై (2013) సాధించాడు. టీమిండియా తరపున రోహిత్ శర్మ 32 టెస్టుల్లో 2,141 పరుగులు.. 224 వన్డేల్లో 9,115 పరుగులు..108 టీ20ల్లో 2,773 పరుగులు సాధించాడు. టీ20ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసింది కూడా రోహితే.

ధోనీ ప్రయోగం
2007లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో రోహిత్ కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అతడ్ని ప్రయోగాత్మకంగా ఓపెనర్‌గా పంపి క్రికెట్ ప్రపంచానికి కొత్త 'హిట్‌మ్యాన్'ని పరిచయం చేశాడు. అప్పటి నుండి రోహిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పరుగుల వరద పారిస్తూ.. టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications