ముంబై: ఐపియల్ 8లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ దూకుడు మీద ఉంది. మంగళవారంనాడు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఏకంగా పైనల్‌కు దూసుకెళ్లింది.
భారీ విజయం దక్కిన నేపథ్యంలో రోహిత్ శర్మ తమ జట్టు బిగ్గెస్ట్ సపోర్టర్ ఎవరనేది వెల్లడించాడు. ముంబై ఇండియన్స్‌కు అభిమానులు దండిగానే ఉన్నారు. ఇందులో ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది కష్టమే అయినప్పటికీ రోహిత్ శర్మ ఆ విషయాన్ని చెప్పడానికి ఏ మాత్రం వెనకంజ వేయలేదు. ఆ ఎంపిక అతనికి సులభమైంది కూడా.

తనకు, ముంబై ఇండియన్స్‌కు అతి పెద్ద సపోర్టుర్ రీతికా సజ్‌దేహ్ అని ఆయన కుండబద్దలు కొట్టాడు. ఏప్రిల్ 30వ తేదీన రోహిత్ శర్మ తన 28వ జన్మదిన వేడుకలను నిర్వహించుకోబోతున్నాడు. స్నేహితురాలు, మేనేజర్ అయిన రీతికతో అతనికి నిశ్చితార్థం కూడా జరిగింది. ముంబై ఇండియన్స్ విజయాన్ని రీతిక స్టాండ్స్‌లోంచి తెగ ఆనందించేసినట్లే ఉంది.
ముంబై ఇండియన్స్ ఈ ఐపియల్ సీజన్‌లో తొలుత తడబాటుకు గురైనట్లు ఆ తర్వాత విజయాలను అందుకుంటూ వచ్చారు. వరుస విజయాలు సాధించుకుంటూ వస్తోంది.