రోహిత్ శర్మ 'ఫస్ట్ క్రష్' ఎవరంటే.. తెలిస్తే షాకే?!!

ముంబై: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడాటోర్నీలన్నీ రద్దుకావడంతో ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సందర్భంగా టీమిండియా క్రికెటర్లంతా తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిన లైవ్‌లో వైట్‌బాల్ క్రికెట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరదాగా సంభాషించుకున్నారు.

యువీతో ఇంటర్వ్యూ:
ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్వ్యూలో భాగంగా జట్టులోకి వచ్చిన కొత్తలో యువరాజ్‌తో తన పరిచయం ఎలా జరిగిందనే విషయాన్ని 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ వెల్లడించాడు. యువరాజ్ సింగ్ తన మొదటి 'క్రికెట్ క్రష్' అని రోహిత్ వెల్లడించాడు. భారత్ తొలిసారి టీ20 ప్రంపచకప్ గెలిచిన సమయంలోనే జట్టులోకి వచ్చిన రోహిత్.. యువీ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ ఇంటర్వ్యూలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

తొలి క్రికెట్ క్రష్ యువరాజే:
యువీతో తన పరిచయం చాలా చిత్రంగా జరిగిందని రోహిత్ చెప్పుకొచ్చాడు. 'టీమిండియాకు ఎంపికైన తొలిసారి టీం బస్సులో ప్రయాణించాల్సి ఉంది. ఎక్కడ ఆలస్యమైతానోనని అరగంట ముందే బస్సులోకి ఎక్కి కూర్చున్నా. అప్పుడు సన్‌గ్లాస్‌లు పెట్టుకొని దర్జాగా నడిచివస్తున్న యువరాజ్‌ను అలా చూస్తుండిపోయా. నా తొలి క్రికెట్ క్రష్ యువరాజే' అని రోహిత్ చెప్పాడు.

సీట్ ఎవరిదో తెలుసా అని గర్జించాడు:
రోహిత్ సమాధానంపై స్పందించిన యువీ.. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పు అని అన్నాడు. 'ముందు నాకు ఘనంగా స్వాగతం పలికిన యువీ.. నువ్వు కూర్చున్న సీట్ ఎవరిదో తెలుసా అని గర్జించాడు. అంతే దెబ్బకు అక్కడి నుంచి లేచి వెళ్లి బస్సులోని ఓ మూలన కూర్చున్నా. ఆ తర్వాత ఆ సీట్ యువీ పాజీదని తెలిసింది' అని రోహిత్ నవ్వుకున్నాడు. దీనిపై యువరాజ్ స్పందిస్తూ.. అప్పట్లో జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లలో రోహిత్ చాలా స్థిరంగా ఆలోచించేవాడని కొనియాడాడు.

తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం:
కెరీర్ ఆరంభంలో యువరాజ్ నుంచి ఎంతో నేర్చుకున్నానన్న రోహిత్.. ఇప్పటికే మేం తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటామని చెప్పుకొచ్చాడు. అప్పటి యంగ్ బ్యాచ్‌లో తనకే ఎక్కువ మెచ్యూరిటీ ఉందని యువీ మెచ్చుకున్నట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత కాలంలో యువీ లాగానే ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేసి.. ఫినిషర్ పాత్రను పోషించానని హిట్‌మ్యాన్ తెలిపాడు. యువరాజ్ గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications