Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రోహిత్‌ శర్మ ఫామ్‌తో ఆడుతుంటే మరింత అందంగా కనిపిస్తాడు'

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఆటను చూస్తుంటే మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆట గుర్తొస్తుందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. తాను రచించిన 'హిట్ అండ్ రీఫ్రెష్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రోహిత్‌ శర్మ ఆటను చూడటం అంటే తనకు ఎంతో చెప్పుకొచ్చారు. 'రోహిత్‌ శర్మ ఆడుతుంటే చూడటం నాకెంతో ఇష్టం. అతని కవర్‌ డ్రైవ్స్‌ చూస్తే నాకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ గుర్తుకొస్తాడు. రోహిత్‌ అద్భుత ఫామ్‌తో ఆడుతుంటే మరింత అందంగా కనిపిస్తాడు' అని అన్నారు.

Rohit Sharma reminds me of VVS Laxman, says Microsoft CEO Satya Nadella

ఇక, భారత జట్టుని విజయపథంలో నడిపిస్తోన్న కెప్టెన్ కోహ్లీపై కూడా సత్య నాదెళ్ల ప్రశంసల వర్షం కురిపించాడు. 'కోహ్లీ ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. ఆట పట్ల అతని ఫ్రొఫెషనలిజం, ఫీల్డింగ్‌ చేసే తీరు ఇంకా ఎన్నో నన్ను ఆకట్టుకున్నాయి. భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియన్లలా చాలా బాగా ఆడుతున్నారు' అని అన్నాడు.

'రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌ కూడా నాకు చాలా ఇష్టం. ఒకే ఓవర్లో అతడు ఆరు బంతుల్ని ఆరు రకాలుగా వేయగలడు. నాకు క్రికెట్‌ చూసేందుకు ఎక్కువ సమయం దొరకదు. కానీ, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. స్కోరు బోర్డులు చూస్తుంటాను. నాకు టెస్టు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం' అని సత్య నాదెళ్ల అన్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+