రోహిత్ శర్మ 32 : 'దేశ్ హిట్ మ్యాన్' అంటూ సెహ్వాగ్ ఫన్నీ ట్వీట్

హైదరాబాద్: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం తన 32వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అటు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుతం క్రికెటర్లు అతడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రోహిత్ శర్మ ముద్దుపేరు హిట్ మ్యాన్
భారత్ తరుపున ఇప్పటికే 200 వన్డేలు, 27 టెస్టులు, 94 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. అభిమానులు ముద్దుగా రోహిత్ శర్మను 'హిట్ మ్యాన్' అని పిలుచుకుంటారు. రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపారు.

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన అరుదైన రికార్డు కూడా రోహిత్ శర్మ ఖాతాలోనే ఉంది. టెస్టు, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.

ఐపీఎల్ 12వ సీజన్‌లో
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసు కోసం పోటీ పడుతోంది. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమి పాలై, ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications