WWE: రోహిత్ శర్మ అందుకున్న అరుదైన గిఫ్ట్ ఏంటో తెలుసా!
హైదరాబాద్: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను మూడోసారి గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఓ అరుదైన బహుమతిని అందుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ సీఓఓ ట్రిపుల్ హెచ్ ఇచ్చిన మాట ప్రకారం వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ బెల్ట్‌ను ముంబై జట్టు కోసం పంపించాడు. గత మే నెలలో ముంబై జట్టు ఐపీఎల విజేతగా నిలిచిన నేపథ్యంలో ఆ జట్టుకు ఓ బహుమతి ఇస్తానని ట్రిపుల్ హెచ్ ట్వీట్ చేశాడు.
అయితే ఆ బహుమతి ఏంటో చెబుతూ ముంబై ఇండియన్స్ అభిమానులకు చెబుతూ ఇప్పటికే ఆ గిప్ట్‌ని ఇండియాకు పంపించినట్లు అతను మరో ట్వీట్ చేశాడు. ఆ గిప్ట్ ఏంటంటే వరల్డ్ హెవీవెయిట్ చాంపియన్‌షిప్ బెల్ట్. ఈ బెల్ట్‌పై రెండు ముంబై ఇండియన్స్ లోగోలు కూడా ఉన్నాయి. ఇచ్చిన మాట ప్రకారం బెల్ట్‌ను పంపిస్తున్నట్లు ట్రిపుల్ హెచ్ ట్వీట్ చేశాడు.
ఈ బహుమతిని అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు డబ్ల్యూడబ్ల్యూఈ సీఓఓ ట్రిపుల్ హెచ్‌కి ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ బెల్ట్‌తో కలిసి దిగిన ఫోటోలను అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
ట్రిపుల్ హెచ్ ఇలా హెవీవెయిట్ చాంపియన్‌షిప్ బెల్ట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఎన్‌బీఏ చాంపియన్‌షిప్ గెలిచిన గోల్డెన్ స్టేట్ వారియర్స్‌కు, ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ విజేతలు చెల్సీ టీమ్‌కు కూడా అతను బెల్ట్‌లు పంపించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications