For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాటతో బంగ్లా బ్యాట్స్‌మన్‌ను తికమక పెట్టిన ధావన్!!

Rohit Sharma Recalls How Shikhar Dhawan Stunned Tamim Iqbal by Singing

ముంబై: టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఒకానొక సందర్భంలో తన పాటతో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్‌ తమిమ్‌ ఇక్బాల్‌ను తికమక పెట్టాడట. ఈ విషయాన్ని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ వివరించాడు. తాజాగా ధావన్‌-రోహిత్ ఇద్దరూ మరో భారత ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌తో వీడియో చాట్‌‌ నిర్వహించారు. ఆ వీడియోలోని కొంత భాగాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం రాత్రి ట్వీట్‌ చేసింది. పూర్తి వీడియోను త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొంది.

పంజాబీ పాట పాడిన గబ్బర్:

పంజాబీ పాట పాడిన గబ్బర్:

బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో మయాంక్‌ అగర్వాల్ తొలుత శిఖర్ ధావన్‌ను ఓ పంజాబీ పాట పాడమని అడిగాడు. తాను పంజాబీ పాటలు బాగా పాడలేనని.. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అద్భుతంగా పాడతాడని చెప్పాడు. మయాంక్‌ మరోసారి అడగ్గా.. ఇక చేసేదేంలేక రోహిత్‌ శర్మతో తరచూ పాడే ఓ పంజాబీ పాటని అందుకున్నాడు. ధావన్‌ ఆ పాటను పూర్తి చేసిన వెంటనే.. రోహిత్‌ ఒక్కసారిగా నవ్వుకున్నాడు. అనంతరం అతడు మాట్లాడుతూ 2015 బంగ్లాదేశ్‌ పర్యటనను గుర్తుచేసుకున్నాడు.

పాట విని తమిమ్‌ అవాక్కయ్యాడు:

పాట విని తమిమ్‌ అవాక్కయ్యాడు:

రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... '2015లో బంగ్లాదేశ్‌ పర్యటన సందర్భంగా ఓ మ్యాచ్‌ ఆడుతున్నాం. అప్పుడు నేను తొలి స్లిప్‌లో ఉండగా.. ధావన్‌ మూడో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. గబ్బర్ గట్టిగా పాట పాడటం మొదలెట్టాడు. అప్పుడు తమిమ్‌ ఇక్బాల్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఈ పాట విని అతడు అవాక్కయ్యాడు. ఎక్కడి నుంచి పాట వస్తుందనే విషయం అతడికి అర్థంకాలేదు. దాంతో మేం ఒకటే నవ్వుకున్నాం. అదిప్పుడు అంత హాస్యాస్పదంగా ఉండదు కానీ.. ఆ రోజు మైదానంలో మాత్రం నవ్వు ఆపుకోలేకపోయాం' అని చెప్పాడు.

 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి:

2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి:

శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి భారత జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. వీరిమధ్య చక్కటి సమన్వయం నెలకొంది. దాంతో ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ ది ఫీల్డ్‌ ఎక్కడైనా సరదాగా ఉంటారు. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కి రోహిత్ ‌శర్మను పేరును బీసీసీఐ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇక ధావన్‌ పేరును ప్రతిష్టాత్మక అర్జున పురస్కారానికి బీసీసీఐ నామినేట్‌ చేసింది. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 136 వన్డేలు 61 టీ20లు ఆడాడు. రోహిత్ భారత్ తరఫున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.

 గాయాల కారణంగా ఇంటికే పరిమిరితం:

గాయాల కారణంగా ఇంటికే పరిమిరితం:

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి. ఇప్పడు ఏకంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు.

Story first published: Saturday, June 6, 2020, 12:37 [IST]
Other articles published on Jun 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+