Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: పొలార్డ్ రిటైర్‌మెంట్‌పై స్పందించిన రోహిత్.. తీరిక దొరికిందా? అంటూ ఫ్యాన్స్ ఫైర్

 Rohit Sharma reacts to Pollard retirement and fans fume at indian skipper

ముంబై ఇండియన్స్ లెజెండ్ కీరన్ పొలార్డ్.. ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఈ లీగ్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న పొలార్డ్.. భారత్‌లో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో తను ఆడటం లేదని, ముంబైకు కాకుండా మరో జట్టుకు ఆడే ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశాడు.

రోహిత్ ఏమన్నాడంటే?

రోహిత్ ఏమన్నాడంటే?

పొలార్డ్ ఇలా రిటైర్‌మెంట్ ప్రకటించడంపై ముంబై ఇండియన్స్ సారధి. టీమిండియా స్టార్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్టు పెట్టిన రోహిత్.. 'బిగ్ మ్యాన్.. బిగ్ ఇంపాక్ట్.. ఎప్పుడూ మనసు పెట్టి ఆడేవాడు. ముంబై ఇండియన్స్ నిజమైన లెజెండ్' అన్నాడు. వీళ్లిద్దరూ కలిసి ముంబైకి చాలా ఐపీఎల్ ట్రోఫీలు అందించిన సంగతి తెలిసిందే. గతేడాది ముంబై యాజమాన్యం ముందుగా రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో కూడా పొలార్డ్ ఒకడు.

ఇద్దరి మధ్య బంధం..

ఇద్దరి మధ్య బంధం..

2010 నుంచి ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ ఆడుతున్నాడు. ఆ మరుసటి ఏడాది అంటే 2011లో ముంబై ఫ్యామిలీలోకి రోహిత్ అడుగు పెట్టాడు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్ అయిన తర్వాత కూడా అద్భుతంగా రాణించిన పొలార్డ్.. అతనికి మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలిసిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌ ట్రోఫీని ఐదు సార్లు ముద్దాడటం గమనార్హం.

ఫ్యాన్స్ ఆగ్రహం

రోహిత్ శర్మ ఇలా పొలార్డ్ గురించి స్పందించడంపై భారత క్రికెట్ అభిమానులు మండి పడుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దాని గురించి రోహిత్ తన సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్ చెయ్యలేదు.

ఇప్పుడు ఐపీఎల్‌లో తన సహచరుడి గురించి పోస్టు చేయడంతో.. 'ఇండియా ఓడిపోతే ఎలాంటి పోస్టులూ లేవు కానీ.. ఐపీఎల్ అనగానే పోస్టులు పెడుతున్నాడు' అని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఐపీఎల్ అనగానే తీరిక దొరికినట్లుందిగా అంటూ వెటకారం ఆడుతున్నారు.

Story first published: Wednesday, November 16, 2022, 16:58 [IST]
Other articles published on Nov 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+