Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టుల్లో ఓపెనర్‌గా సెహ్వాగ్‌తో పోలికపై రోహిత్ శర్మ స్పందన ఇదీ!

Rohit Sharma Reacts To Comparisons With Virender Sehwag || Oneindia Telugu
Rohit Sharma Quashes Off Comparisons With Ex-opener Virender Sehwag

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో తనను పోల్చడంపై టీమిండియా బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. సెహ్వాగ్‌తో కలిపి తన పేరు వినబడటం చాలా సంతోషంగానే ఉందని రోహిత్ తెలిపాడు. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు.

"సెహ్వాగ్‌ సెహ్వాగే. క్రికెట్‌లో అతడు సాధించినవి నిరూపమానం. నా వరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో అది అందించడమే నా పని. ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే నా సంతోషం రెట్టింపవుతుంది. తన సొంత ఆటతీరును సెహ్వాగ్‌ కూడా ఇష్టపడ్డాడు. అతడు అలా ఆడాలని జట్టు కోరుకుంది. ఇలాంటి పరిస్థితే నాకు ఇప్పుడు ఉంది" అని రోహిత్ శర్మ అన్నాడు.

నేను ఎలా ఆడాలని టీమ్‌ అనుకుంటుందో

నేను ఎలా ఆడాలని టీమ్‌ అనుకుంటుందో

"నేను ఎలా ఆడాలని టీమ్‌ అనుకుంటుందో అలా ఆడటానికి ప్రయత్నిస్తున్నాను. దీంతో చాలా సమస్యలు పరిష్కారమవుతున్నాయి" అని రోహిత్ పేర్కొన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ముందుగానే వచ్చివుంటే బాగుండేమోనన్న ప్రశ్నకు రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని అన్నాడు.

టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం ఆలస్యంగా

టెస్టుల్లో ఓపెనర్‌గా అవకాశం ఆలస్యంగా వచ్చినా తనకు మంచే జరిగిందని చెప్పాడు. భవిష్యత్తులో తనపై విమర్శలు వచ్చినప్పటికీ... టెస్టుల్లో తన సహజసిద్ధమైన ఆటనే కొనసాగిస్తానని రోహిత్‌శర్మ అన్నాడు. మీ ఆటతీరు కారణంగానే టెస్టుల్లో డబుల్ సెంచరీని సులభంగా సాధించారా? అన్న ప్రశ్నకు గాను రోహిత్ శర్మ

టెస్టు క్రికెట్‌లో ఏదీ అంత తేలికగా రాదు

టెస్టు క్రికెట్‌లో ఏదీ అంత తేలికగా రాదు

"టెస్టు క్రికెట్‌లో ఏదీ అంత తేలికగా రాదు. టెస్టు కెరీర్‌ తొలినాళ్లలో నా సహజసిద్ధమైన బ్యాటింగ్‌ను మర్చిపోయి బౌలర్లను ఎక్కువ గౌరవించేవాడిని. అయితే, భవిష్యత్తులో ఎవరు నన్ను విమర్శించినా నేను నా షాట్లను ఆడుతూనే ఉంటాను" అని రోహిత్ చెప్పాడు. "నేను నా ఆటకు మద్దతు ఇస్తూనే ఉంటాను. నాకో బాధ్యత అప్పగించి, జట్టు మేనేజ్‌మెంట్ ఏం చెప్పిందో నాకు తెలుసు" అని అన్నాడు.

కెప్టెన్సీ అనేది మన చేతుల్లోలేదు

కెప్టెన్సీపై మాట్లాడుతూ "కెప్టెన్సీ అనేది మన చేతుల్లోలేదు. టీమిండియాకు సారథ్యం వహించడమంటేనే గొప్ప గౌరవం. ఒక మ్యాచ్‌కా లేదా వంద మ్యాచులకా అని నేను చూడను. మనం అద్భుతంగా రాణిస్తున్నప్పుడు దేశం కోసం ఆడటమే మిన్న. నేను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను మరియు అనుభవం బాగుంది. నన్ను ఎంతకాలం కెప్టెన్‌గా ఉంచుతారనే దాని గురించి నేను ఆలోచించను. సారథ్యం చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి ఆస్వాదించాను" అని రోహిత్ అన్నాడు.

Story first published: Saturday, November 2, 2019, 9:07 [IST]
Other articles published on Nov 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+