
నేనే ఓపెనర్
వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో చేసిన ప్రయోగం ఆ మ్యాచ్ వరకేనని, ఇక నుంచి తానే రెగ్యూలర్‌గా ఓపెనర్‌గా వస్తానని రోహిత్ శర్మ చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌నకు ఎక్కువ దూరం లేదని అందుకే ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపాడు. కాగా విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆరంభించగా రోహిత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అలాగే విండీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ రిషబ్ పంత్ రోహిత్‌కు జతగా ఓపెనింగ్ చేశాడు. కాగా ఈ రెండు ప్రయోగాలు విజయవంతంగా కాక పోగా బెడిసికొట్టాయి. ఈ కారణంతో ప్రయోగాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఇదొక గొప్ప అవకాశం
అలాగే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీపై కూడా రోహిత్ మాట్లాడాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేసే అవకాశం దొరకడం తనకు లభించిన గొప్ప అవకాశంగా చెప్పుకొచ్చాడు. తనకు ఈ అవకాశం రావడం గురించి తెలిసినప్పుడు సంతోషించినట్లు తెలిపాడు. అయితే పూర్తి స్థాయి కెప్టెన్సీ అనేది మంచి అనుభూతిని ఇస్తుందని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఈ ప్రయాణంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, తమ దగ్గర అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని, రాబోయే మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నామని రోహిత్ శర్మ చెప్పాడు.

ఎలాంటి ఆందోళన లేదు
"పని భారం నాకే కాదు, అందరికీ కీలకం. ఆ విషయమై నాకు ఎలాంటి ఆందోళన లేదు. అన్ని మ్యాచ్‌లు ఆడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి రోజు ఫ్రెష్‌గా ఆలోచిస్తే భారమనిపించదు. అవకాశం లభించినప్పుడు విశ్రాంతి తీసుకుంటాం. ఇక జట్టును నడిపించడంపై పూర్తి క్లారిటితో ఉన్నాను " అని రోహిత్ శర్మ చెప్పాడు.

సూర్య దూరమవడం బాధాకరం
గాయం కారణంగా ఇండియా 360 డిగ్రీస్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ జట్టుకు దూరమవడంపై కూడా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘సూర్యకుమారద్ యాదవ్ జట్టుకు దూరమవడం బాధాకరం. ప్రస్తుతం సూర్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగత సత్తా ఉన్న ఆటగాళ్లు బెంచ్‌లో ఉన్నారు. కాబట్టి ఆందోళన అవరం లేదు. వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని రోహిత్ తెలిపాడు.

బుమ్రాకు చాలా క్రికెట్ నాలెడ్జ్
అలాగే పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పగించడంపై కూడా రోహిత్ శర్మ స్పందించాడు. వైస్ కెప్టెన్‌గా ఉన్నది బ్యాటరా? బౌలరా? అనేది ఇక్కడ ప్రశ్నకాదని, బుమ్రాకు క్రికెట్ నాలెడ్జ్ చాలా ఉందని ఆయన తెలిపాడు. తామిద్దరం కలిసిన ప్రతిసారి క్రికెట్ గురించే మాట్లాడుకుంటామని, తాజాగా వైస్ కెప్టెన్సీ కూడా రావడంతో బుమ్రా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్


Click it and Unblock the Notifications












