వారి షాట్లలో బెరుకు లేదు.. వారి ఇన్నింగ్స్‌కు తిరుగులేదు.. పంత్, హార్దిక్ పాండ్యాలపై రోహిత్ ప్రశంసలు

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్, హార్దిక్ 5వ వికెట్‌కు 133పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఓటమి అంచుల్లో నుంచి ఇండియా గెలుపు తీరాలకు మళ్లిన సంగతి తెలిసిందే. 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 72పరుగులకే 4వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడగా.. పంత్, హార్దిక్ వీరోచితంగా పోరాడారు. 55పరుగులు చేయాల్సిన దశలో హార్దిక్ ఔటయినా.. పంత్ కడవరకు క్రీజులో నిలబడి.. మరో 47బంతులు మిగిలి ఉండగానే విజయ లాంఛనాన్ని ముగించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తీవ్ర ఒత్తిడిలోనూ భయపడకుండా హార్దిక్, పంత్ చెలరేగారని, వారి బ్యాటింగ్‌కు తిరుగు లేదని, షాట్ సెలెక్షన్లో బెరుకు లేదని ప్రశంసించాడు.

వికెట్లు కోల్పోతే కష్టమని తెలుసు..
'ఇది చాలా మంచి పిచ్. మేము ముందుగా వికెట్లు కోల్పోతే టార్గెట్ ఛేదించడం సులభం కాదని మాకు తెలుసు. కానీ అదే జరిగింది. అయితే మా పక్షాన సానుకూల విషయం ఏమిటంటే.. మా మిడిలార్డర్ సామర్థ్యాన్ని మేమీ రోజు చూడగలిగాం. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేయగలిగారు. వారిద్దరూ ఏమాత్రం బెరుకులేకుండా ఆడారు. ఏ సమయంలోనూ వారు భయపడుతున్నట్లు మాకు అనిపించలేదు. వారు చాలా గొప్ప క్రికెట్ షాట్లు ఆడారు' అని రోహిత్ పేర్కొన్నాడు.

ఆ మాట వాస్తవమే..
ఇకపోతే ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్లలో భారత టాప్-ఆర్డర్ బ్యాటర్లు పేలవమైన షాట్‌లకు ఔట్ అయ్యారని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు రోహిత్ కాస్త అంగీకరించాడు. 'ఇది కాస్త వాస్తవమే. ఇది మేం పరిశీలించాల్సిన విషయం అని మాకు అర్థమైంది. మేము కొన్ని మంచి షాట్లు ఆడలేదు. అందువల్లే మేం వికెట్లు కోల్పోయాం. కానీ నేను ఇప్పటికీ మా జట్టు టాపార్డర్ బ్యాటర్లకు మద్దతు ఇస్తున్నాను.. ఎందుకంటే వారు చాలా కాలంగా ఎంతో రాణించారు. నేను ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. వారు జట్టుకు తీసుకువచ్చే ఇంపార్టెన్స్‌ని నేను అర్థం చేసుకుంటున్నా' అని రోహిత్ చెప్పాడు.

విజయవంతంగా ఇంగ్లాండ్ పర్యటన
ఇకపోతే జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్ లాంటి ముఖ్యమైన వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో 71పరుగులు చేసిన హార్దిక్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా.. తొలి వన్డే సెంచరీతో విజయాన్ని అందించిన పంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి వన్డే, మూడో వన్డే గెలిచిన ఇండియా 2-1తేడాతో వన్డే సిరీస్ విజయం సాధించింది. అంతకుముందు టీ20 సిరీస్ కూడా 2-1తేడాతో ఇండియా గెలుపొందింది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బట్లర్ రెండు సిరీస్‌లు ఓడిపోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా విజయవంతంగా ముగించింది. రీషెడ్యూల్ చేసిన టెస్టులో మట్టుకు ఇండియా ఓటమిపాలయింది. ఇక టెస్ట్ సిరీస్ 2-2తేడాతో సమమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications