For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : చెమట చిందిస్తున్న రోహిత్.. ‘సెంచరీ లోడింగ్..’ అంటున్న ఫ్యాన్స్!

Rohit Sharma practises hard before INDvsNZ first ODI

బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన రోహిత్ శర్మ కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ మైదానంలో దిగాడు. ఈ క్రమంలో కొంత వెయిట్ కూడా తగ్గినట్లు కనిపిస్తున్న అతను.. మునుపటి టచ్‌లోకి వచ్చినట్లే అనిపిస్తోంది. బంతిని చక్కగా మిడిల్ చేస్తూ అద్భుతంగా ఆడుతున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలోనే సెంచరీ చేసేలా కనిపించాడీ స్టార్ ఓపెనర్. కానీ త్రుటిలో ఆ ఛాన్స్ మిస్ అయింది.

రెండో వన్డేలో విఫలమైన రోహిత్ మరోసారి మూడో వన్డేలో అద్భుతమైన టచ్‌లో కనిపించాడు. బంతిని మైదానం నలుమూలలా బాదేస్తూ, భారీ షాట్లు ఆడేస్తూ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మరో భారీ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు. ఇలా తనకు దక్కిన శుభారంభాలను సెంచరీలుగా మలిచడంలో ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో అతని పార్టనర్ శుభ్‌మన్ గిల్ ఈ సమస్యను అధిగమించి మూడో వన్డేలో శతకం నమోదు చేశాడు. ఇక కోహ్లీ గురించి చెప్పాల్సిన పని లేదు.

ఇలాంటి సమయంలో న్యూజిల్యాండ్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు భారత్ సన్నద్ధమైంది. హైదరాబాద్ వేదికగా జరిగే తొలి వన్డేలో భారత జట్టు బరిలో దిగుతోంది. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా భారీ స్కోరు చేయాలని రోహిత్ భావిస్తున్నాడు. తనకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలం అవుతున్న అతను.. నెట్స్‌లో చెమటలు చిందించాడు. తీవ్రంగా శ్రమిస్తూ తన స్ట్రోక్ ప్లేపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. అతని ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు 'సెంచరీలు లోడింగ్..' అంటూ కామెంట్లు చేస్తున్నారు.భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే కోహ్లీతోపాటు రోహిత్ కూడా ఫామ్ అందుకోవాలని ఇప్పటికే చాలా మంది మాజీలు చెప్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 18, 2023, 9:35 [IST]
Other articles published on Jan 18, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+