Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sydney Test: భారత ఆటగాళ్లకు రెండు రోజులు హాలిడే.. రోహిత్‌కు మాత్రం కాదు!!

Rohit Sharma practice in Nets, Team India enjoys 2-day rest before Sydney Test

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యంగా వెళ్లిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సిడ్నీలో 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని బుధవారం సాయంత్రం భారత జట్టుతో కలిశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గాయం నుంచి కోలుకున్న హిట్‌మ్యాన్.. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్‌నెస్‌ పరీక్షలో నెగ్గితేనే రోహిత్ సిడ్నీ టెస్టులో ఆడుతాడు.

రెండు రోజుల హాలిడే

బాక్సింగ్ డే టెస్ట్‌లో అద్భుత విజ‌యం సాధించిన భారత ఆటగాళ్లు అందరూ రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేస్తుంటే.. రోహిత్ శ‌ర్మ మాత్రం నెట్స్‌లో చెమ‌టోడుస్తున్నాడు. సిడ్నీలో క్వారంటైన్‌ను ముగించుకొని జట్టు‌తో క‌లిసిన రోహిత్‌.. ఏమాత్రం సమయం వృథా చేయ‌కుండా మైదానంలోకి అడుగుపెట్టాడు. బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌, మ‌రో ముగ్గురు మాత్ర‌మే రోహిత్‌కు సాయం చేయ‌డానికి మెల్‌బోర్న్ గ్రౌండ్‌కు వ‌చ్చిన‌ట్లు స్పోర్ట్స్ అన‌లిస్ట్ బోరియా మ‌జుందార్ ట్వీట్ చేశాడు. రోహిత్ క్యాచులు పడుతున్న ఫొటోను అతడు ట్వీట్ చేశాడు.

మొదటి ప్రాక్టీస్ సెషన్

మొదటి ప్రాక్టీస్ సెషన్

'జట్టు 2 రోజుల విరామం పొందుతుంది. రోహిత్ శర్మ మాత్రం ఈ రోజు ఆస్ట్రేలియాలో తన మొదటి ప్రాక్టీస్ సెషన్ కోసం నెట్స్‌లో ఉన్నాడు. అతను బ్యాటింగ్ కోచ్ మరియు త్రోడౌన్ నిపుణులతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోహిత్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమయింది' అని బోరియా మ‌జుందార్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2020లో గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌తో పాటు తొలి రెండు టెస్ట్‌ల‌కు రోహిత్ దూర‌మ‌య్యాడు. సిడ్నీలో జ‌ర‌గ‌బోయే మూడో టెస్ట్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌నున్నాడు. గురువార‌మే ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ సిడ్నీ వెళ్లాల్సి ఉన్నా.. అక్క‌డి కొవిడ్ ప‌రిస్థితుల కార‌ణంగా జ‌న‌వ‌రి 4కు ప్ర‌యాణాన్ని వాయిదా వేశారు.

రోహిత్‌కు ఘనస్వాగతం

రోహిత్‌కు ఘనస్వాగతం

రోహిత్ శర్మ బుధవారం సాయంత్రం​ మెల్‌బోర్న్‌లోని హోటల్‌ రూంలో ఉన్న భరత జట్టును కలిశాడు. ఈ సందర్భంగా రహానే సేన రోహిత్‌కు ఘనస్వాగతం పలికింది. హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అయితే క్వారంటైన్‌ తర్వాత నాజూగ్గా కనిపిస్తున్నావని అతడిని పలకరించడం గమనార్హం. 'మిత్రమా.. నీ క్వారంటైన్‌ ఎలా గడిచింది? చాలా నాజూగ్గా (యువకుడు) కనిపిస్తున్నావ్‌' అని ప్రత్యేకంగా అన్నాడు. రోహిత్‌తో రవిశాస్త్రి అన్న వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తుది జట్టులోకి వస్తే

తుది జట్టులోకి వస్తే

రోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తే.. ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారిలో ఒకరిపై కచ్చితంగా వేటుపడనుంది. అయితే రోహిత్ ఓపెనింగ్ చేస్తాడా? లేదా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడా? అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. హిట్‌మ్యాన్‌ ఏ స్థానంలో ఆడతాడనేది జట్టు యాజమాన్యం ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఇద్దరినీ బెంచ్‌కు పరిమితం చేసి.. కేఎల్‌ రాహుల్, రోహిత్‌ శర్మను తుది జట్టులోకి తీసుకోవాలని కొందరు మాజీలు సూచిస్తున్నారు.

టీ20ల్లో ధోనీ పెద్దగా చేసిందేమీ లేదు.. అయినా జట్టులో చోటేలా ఇస్తారు? బట్లర్ ఉన్నాడుగా: ఆకాశ్ చోప్రా

Story first published: Thursday, December 31, 2020, 15:44 [IST]
Other articles published on Dec 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+