Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇప్పటి నుంచే.. సమైరాకి బ్యాటింగ్ నేర్పిస్తున్న రోహిత్ (వీడియో)!!

Rohit Sharma plays indoor cricket with daughter Samaira during Janata Curfew
Rohit Sharma Plays Indoor Cricket With Daughter Samaira

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే పడింది. ఇప్పటికే అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. టోర్నీలు, ప్రాక్టీస్‌ సెషన్స్‌ లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సిరీస్, ఐపీఎల్‌ వాయిదా పడడంతో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంట్లోనే ఉంటున్నాడు.

సమైరాతో కలిసి రోహిత్ క్రికెట్

సమైరాతో కలిసి రోహిత్ క్రికెట్

కరోనా పుణ్యమాని రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నాడు. ఇంట్లో తన ముద్దుల కూతురు సమైరాతో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. సమైరా కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన బ్యాట్‌‌తో ఆమెకి రోహిత్ బ్యాటింగ్ నేర్పిస్తున్నాడు. అయితే.. క్రికెట్ బాల్ కాకుండా ఫుట్‌బాల్‌‌‌తో ఆడారు. రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరు బౌలింగ్ చేయగా.. రోహిత్, సమైరాలు స్ట్రెయిట్ డ్రైవ్ ఆడారు. షాట్ అనంతరం సమైరా ఎంతో సంతోషడింది. దీనికి సంబందించిన వీడియోను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసాడు.

భూమాతకు ఓ మార్గం దొరికింది:

భూమాతకు ఓ మార్గం దొరికింది:

రోహిత్ ఆదివారం ఓ ట్వీట్‌ చేశాడు. 'ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని నయం చేయడానికి భూమాత ఓ మార్గాన్ని ఎంచుకుంది. కొద్ది కాలంలోనే మన జీవనశైలిని మార్చుకునేలా చేసింది. వాతావరణ మార్పులను సరిదిద్దే చర్యలలో మనం ఎప్పుడూ అలసత్వం వహిస్తూ వచ్చాం. కానీ.. మన అందరం కలిసి చేసే పనులను రివర్స్‌ చేసి.. తనని తాను భూమాత నయం చేసుకుంటోంది' అని రోహిత్ ట్వీట్‌ చేశాడు.

ఇందులో ఒకరు మిస్‌ అయ్యారు:

ఇందులో ఒకరు మిస్‌ అయ్యారు:

తాజాగా ఐసీసీ నిర్వహించిన ఓ పోల్‌ను చూసిన రోహిత్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ఐసీసీ ట్విటర్‌ పేజీలో కింది బ్యాట్స్‌మెన్‌లో ఎవరు పుల్‌షాట్‌ను చాలా బాగా ఆడతారంటూ ఒక పోల్‌ పెట్టి.. వివ్‌ రిచర్డ్స్‌, రికీ పాంటింగ్‌, హెర్ష్‌లె గిబ్స్‌, విరాట్‌ కోహ్లీల ఫొటోలు ఉంచింది. దీనిపై రోహిత్‌ ఆసక్తికర రీతిలో స్పందించాడు. ఇందులో ఒకరు మిస్సయినట్లున్నారే.. అంటూ ట్వీట్‌ చేశాడు. 'ఇందులో ఒకరు మిస్‌ అయ్యారు. నా అంచనా ప్రకారం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం అంత సులువు కాదు' అని ట్వీట్‌ చేశాడు.

ఐపీఎల్ జరగకపోతే 15 కోట్లు నష్టం:

దక్షిణాఫ్రికా సిరీస్, ఐపీఎల్‌ వాయిదా పడడంతో రోహిత్ శర్మ ఇంట్లోనే ఉంటున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మెగా లీగ్‌లో రోహిత్.. ముంబైకి నాలుగు టైటిళ్లు అందించాడు. గత సీజన్‌లో తన సూపర్ కెప్టెన్సీ‌తో ఒక్క పరుగు తేడాతో చెన్నై‌ను ఓడించి ముంబైని విజేతగా నిలిపాడు. ఇంత విలువైన ఆటగాడిని కేవలం రూ.15 కోట్లకే ముంబై సొంతం చేసుకోవడం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏది ఏమైనా ఈ సారి ఐపీఎల్ జరగకపోతే హిట్ మ్యాన్ ఈ అమౌంట్ మొత్తం కోల్పోనున్నాడు.

Story first published: Monday, March 23, 2020, 16:26 [IST]
Other articles published on Mar 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+