ఓపెనర్‌గా వద్దు - రోహిత్ శర్మ ఎందుకు అలా చేస్తోన్నాడో అర్థం కావట్లేదు: కోచ్ ఘాటు కామెంట్స్

ముంబై: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన భారత్- తన మలి సమరానికి సమాయాత్తమౌతోంది. రెండో మ్యాచ్‌లో నెదర్లండ్స్‌ను ఢీ కొట్టబోతోంది. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. పాకిస్తాన్‌పై తడాఖా చూపిన టీమిండియా- నెదర్లాండ్స్‌పై ఎలా ఆడుతుందనేది ఆసక్తి రేపుతోంది. అందరి దృష్టీ విరాట్ కోహ్లీ మీదే నిలిచింది.

రోహిత్ ఆటతీరుపై..
అదే సమయంలో కేప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపైనా ఆందోళన వ్యక్తమౌతోంది. ఆస్ట్రేలియాపై అడుగు పెట్టినప్పటి నుంచీ భారీ ఇన్నింగ్స్ ఆడట్లేదతను. వామప్స్ మ్యాచ్‌లల్లో తన స్థాయిలో ఆడలేదు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ నెల 23వ తేదీన పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలం అయ్యాడు హిట్ మ్యాన్. ఏడు బంతుల్లో నాలుగే నాలుగు పరుగులు చేశాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఇఫ్తికర్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 3.2 ఓవర్లల్లో 10 పరుగులే.

కోచ్ కీలక వ్యాఖ్యలు..
అంతకుముందు వామప్స్‌లో ఆస్ట్రేలియాపై 14 పరుగులే చేశాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. దీనిపై అతని చిన్నప్పటి కోచ్ దినేష్ లాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కొంతకాలం ఇన్నింగ్ ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుందని, పవర్ ప్లేలో రోహిత్ శర్మ అవసరం జట్టుకు ఉందని అభిప్రాయపడ్డాడు. తన సహజ శైలిలో ఆడాలని సూచించాడు. ప్రస్తుతం రోహిత్ హైరిస్క్ గేమ్ ఆడుతున్నాడని వ్యాఖ్యానించాడు.

ఓవర్ అగ్రెసివ్‌గా..
ఓవర్ అగ్రెసివ్‌గా ఆడాలనుకోవడం వల్లే రోహిత్ శర్మ తప్పులు చేస్తోన్నాడనిపిస్తోందని చిన్నప్పటి కోచ్ చెప్పారు. అతను చాలా కాలంగా హై-రిస్క్ గేమ్‌ను ఆడుతున్నాడు, అది సరైనది కాదని వ్యాఖ్యానించారు. అతను ఎందుకు అలా చేస్తున్నాడో తనకు తెలియట్లేదని, అతిగా దూకుడుగా ఆడటంలో తప్పు చేస్తున్నాడని తాను భావిస్తున్నట్లు దినేష్ లాడ్ అంచనా వేశారు. రోహిత్ శర్మ క్రీజ్‌లో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నానని అన్నారు.

అనవసరంగా వికెట్ పారేసుకుంటోన్నాడు..
రోహిత్ శర్మ అనవసరంగా తన వికెట్‌ను పారేసుకుంటోన్నాడని, పవర్‌ప్లేలో మొదటి ఆరు ఓవర్లలో అతను క్రీజ్‌లో ఉండాల్సిన అవసరం జట్టుకు ఎంతగానో ఉందని దినేష్ లాడ్ అన్నారు. 17-18 ఓవర్లు ఆడటానికి ప్రయత్నించాలని, ప్రతి మ్యాచ్‌లోనూ 70 నుంచి 80 పరుగులు చేయాలనేది తన ఆకాంక్ష అని దినేష్ లాడ్ చెప్పారు. రోహిత్ విధానంలో మార్పు రావాలని, రోహిత్ శర్మను యాంకర్‌గా చూడాలనుకుంటున్నానే తప్ప డెస్ట్రాయర్‌గా కాదని వ్యాఖ్యానించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications