Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను పక్కన పెట్టేశాడుగా!

Team India took shocking decision in first INDvsAUS test. Rohit picked Suryakumar Yadav over Shubman Gill.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడేందుకు భారత జట్టు సిద్ధమైంది. నాగ్‌పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా ముందుగా బౌలింగ్ చేయనుంది. పిచ్ చాలా డ్రైగా ఉందని ఇరు జట్ల కెప్టెన్లు చెప్పారు. దీంతో తొలి రోజు నుంచే స్పిన్‌పై ఎక్కువగా ఈ కెప్టెన్లు ఆధారపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆసీస్‌లో ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్‌ను పక్కన పెట్టేసినట్లు కమిన్స్ వెల్లడించాడు.

శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో ఆడినప్పుడు స్పిన్‌ను ఎదుర్కోవడంలో హెడ్ ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అందుకే అతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే టీమిండియా సారధి రోహిత్ శర్మ కూడా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్‌కు జట్టులో చోటివ్వలేదు. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో అయినా అతన్ని ఆడించాలని మాజీలు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఆలోచనను రోహిత్ అండ్ కో ఎంటర్‌టైన్ చెయ్యలేదు. పంత్ లేని లోటు తీర్చడమే కాకుండా.. మిడిలార్డర్‌లో ఇంపాక్ట్ చూపించేందుకు సూర్యకుమార్‌ను తీసుకున్నాడు.

అలాగే అందరూ అనుకున్నట్లే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కలేదు. కేఎస్ భరత్‌ అరంగేట్రం చేస్తున్నట్లు రోహిత్ తెలిపాడు. అతనికి ఛటేశ్వర్ పుజారా టెస్టు క్యాప్ అందించాడు. సూర్యకుమార్ యాదవ్‌కు రవిశాస్త్రి క్యాప్ అందించాడు. అంటే కీలకమైన తొలి టెస్టులోనే టీమిండియా నుంచి ఇద్దరు అరంగేట్ర ఆటగాళ్లు బరిలో దిగుతున్నారన్నమాట. మిడిలార్డర్‌లో టీమిండియాకు వీళ్లిద్దరూ కీలకం కానున్నారు. పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ లేని లోటును వీళ్లు తీర్చాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. కానీ సాధ్యమైనంత ప్రయత్నించక తప్పదు. ఈ సిరీస్‌లో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తేనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుతుంది.

Story first published: Thursday, February 9, 2023, 9:34 [IST]
Other articles published on Feb 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+