
బెంగళూరు: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. గాయం కారణంగా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు దూరమైన కెప్టెన్ రోహిత్‌శర్మ కోలుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ప్రాథమిక ఫిట్‌నెస్ పరీక్షల్లో హిట్‌మ్యాన్ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. అయితే సోమవారం రోహిత్ శర్మ మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరుకానున్నాడు. అందులో కూడా నెగ్గితే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు హిట్‌మ్యాన్ అందుబాటులో ఉండనున్నాడు. దీంతో టెస్టు సిరీస్‌లో రోహిత్ లేడని బాధపడుతున్న ఫ్యాన్స్‌కు ఇది కాస్త ఊరనిచ్చే అంశం. కాగా ప్రస్తుతం రోహిత్‌శర్మ ఎన్‌సీఏలోనే ఉన్నాడు. గాయం కారణంగా ఇప్పటికే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ వన్డేలకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే డైలమా ఉంది.
దీంతో సోమవారం నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షలను బట్టి రోహిత్‌శర్మపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సెలెక్టర్లు మరో రెండు రోజుల్లో జట్టును ప్రకటించనున్నారని సమాచారం. రోహిత్‌శర్మ కెప్టెన్‌గా ఉండనుండగా వైస్ కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ఓపెనర్ లోకేష్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రాహుల్‌ను గాయపడ్డ రోహిత్‌శర్మ స్థానంలో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్‌శర్మ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్ సమయంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా ఆ బాధ్యతలను హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అందించింది బీసీసీఐ. రోహిత్ కెప్టెన్సీలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌లో మూడింట్లోనూ గెలిచి కివీస్‌ను వైట్‌వాష్ చేసింది. అయితే కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు హిట్‌మ్యాన్ విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు.
అతని తొడ కండరాల గాయం తిరగబెట్టడంతో సఫారీలతో టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అప్పటి నుంచి బెంగళూరులోని ఎన్సీఏలో ఫిజియోథెరపీల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ కోలుకున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. కాగా భారత్, సౌతాఫ్రికా మధ్య జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 19న తొలి వన్డే జరగనుండగా.. 21న రెండో వన్డే జరగనుంది. ఇక 23న సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే జరగనుంది.