For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని దాటిన రోహిత్, ధావన్ కెరీర్‌లో 1000వాలా!!

 Rohit Sharma overtakes Virat Kohli to become Indias highest run-getter in T20Is

హైదరాబాద్: రెండు ఫార్మాట్‌లలో విజయం సాధించి టీ20ల్లోనూ శుభారంభాన్ని నమోదు చేసిన టీమిండియా వెస్టిండీస్‌పై మరోసారి జులుం చూపించింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ వీర బాదుడుతో సెంచరీ బాదాడు. ఓపెనర్‌గా దిగిన రోహిత్.. క్రీజులో పాతుకుపోయాడు. రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌; 61 బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సులు)తో రెచ్చిపోయాడు.

India vs West Indies 2nd T20I : Twitterati Lauds Rohit Sharma
కోహ్లీ రికార్డును కొట్టేసిన ధావన్:

కోహ్లీ రికార్డును కొట్టేసిన ధావన్:

దీంతో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనత వహించాడు. థామస్‌ వేసిన ఐదో ఓవర్‌ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచి రోహిత్‌(2108) అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరూ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ కోహ్లీ(2102) ఉన్నాడు. తాజాగా రోహిత్‌.. కోహ్లీని వెనక్కి నెట్టేసి తన పేరిట నూతన రికార్డు నెలకొల్పాడు.

Player Matches Runs 100
Rohit Sharma 86 2203 4
Virat Kohli 62 2102 0
Suresh Raina 78 1605 1
Ms Dhoni 93 1487 0
Yuvraj Singh 50 1177 0
ధావన్ కెరీర్‌లో 1000వాలా

ధావన్ కెరీర్‌లో 1000వాలా

మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా అంతర్జాతీయ టీ20ల్లో 1000పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. బ్రాత్‌వైట్‌ వేసిన ఏడో తొలి బంతికి సింగిల్‌ రాబట్టి ధావన్‌ వేయి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ధావన్‌ (43; 41 బంతుల్లో 3ఫోర్లు) జట్టు స్కోరు 113 వద్ద ధావన్‌ ఔటైనా... రోహిత్‌ దంచుతూ పోయాడు.

71 పరుగుల తేడాతో భారత ఘనవిజయం

71 పరుగుల తేడాతో భారత ఘనవిజయం

రెండో టీ20లో భారత్‌ 71 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. మొదట భారత్‌ 2 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఛేదనలో వెస్టిండీస్‌ తేలిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. చాలా ముందే ఆ జట్టు పరాజయం ఖాయమైంది. డారెన్‌ బ్రావో (23) టాప్‌ స్కోరర్‌. భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కుల్దీప్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

 మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‌గా రోహిత్‌

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‌గా రోహిత్‌

ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఫీల్డింగ్‌‌లో కూడా పేలవమైన ప్రదర్శన చేసింది. టీ 20 సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20 నామమాత్రంగా 11న చెన్నైలో జరుగుతుంది. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Wednesday, November 7, 2018, 11:56 [IST]
Other articles published on Nov 7, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+