Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విశాఖలో తొలి టీ20: ప్రపంచ రికార్డుని మిస్ చేసుకున్న రోహిత్ శర్మ!

India Vs Australia 2019,T20I : Rohit Sharma Missed A New World Record In T20I | Oneindia Telugu
Rohit Sharma

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డుకి ఒక సిక్స్ దూరంలో నిలిచాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సుదీర్ఘ పర్యటనకు తెరలేచింది. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి తొలి టీ20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించేవాడు. కనీసం ఒక్క సిక్స్ కొట్టినా మార్టిన్ గుప్టిల్(న్యూజిలాండ్), క్రిస్ గేల్‌(వెస్టిండిస్)తో సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకునేవాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(5) జట్టు స్కోరు 14 పరుగుల వద్ద ఆడమ్ జంపా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

దీంతో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌ రికార్డుని మిస్ చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాను ఓసారి పరిశీలిస్తే న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్‌గేల్ 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

1
45583

ప్రస్తుతం 102 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, భారత్ తరఫున టీ20ల్లో రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డ్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ 72 సిక్సర్లతో ఉన్నాడు. టీమిండియా తరఫున టాప్-10లో ఈ ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు.

Story first published: Sunday, February 24, 2019, 19:25 [IST]
Other articles published on Feb 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+