Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS PAK Rohith: పాకిస్థాన్‌తో మ్యాచ్.. 'అది నేనలా చెప్తాను - అక్షర్ నువ్వైతే రెడీగా ఉండు!'

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ వేటను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో షమీ 5 వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ శతక్కొట్టాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్నందించాడు. ఈ నేపథ్యంలో జట్టు విజయం సాధించడంపై కెప్టెన్ రోహిత శర్మ హర్షం వ్యక్తం చేశాడు. గిల్ పై ప్రశంసలు కురిపించడంతో పాటు మరోసారి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్యాచ్ ను మిస్ చేయడంపై స్పందించాడు. అక్షర్ కు డిన్నర్ ట్రీట్ ఇస్తానని చెప్పాడు. పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ పిచ్ గురించి కూడా మాట్లాడాడు.

మాకు ముందే తెలుసు..
"మ్యాచ్ ఆడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట కొనసాగుతున్నప్పుడు మనలో భిన్న భావోద్వేగాలు కలుగుతాయి. అయితే మా డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా అనుభవం ఉంది. గిల్, కేఎల్ చాలా బాగా ఆడారు. పిచ్ పరిస్థితులను బట్టి ఎలా ఆడాలి, ఏం చేయాలనేది ఆలోచించాలి. మేము జట్టుగా పరిస్థితులను బాగా అంచనా వేశాం. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలో కచ్చితంగా ఒత్తిడికి గురౌతాం. చాలా కాలం తర్వాత షమీ అద్భుతంగా రాణించడం చాలా సంతోషంగా ఉంది. అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడో మేం ముందే ఊహించాం. జట్టుకు అవసరమైనప్పుడు అండగా నిలబడే అతనిలాంటి వాళ్లు ఉండాలి. గిల్ క్లాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరి వరకు అతడు బ్యాటింగ్ చేయడం విశేషం." అని రోహిత్ అన్నాడు.

Rohit Sharma offers dinner treat to AxarPatel for catch miss in IND VS BAN Champions Trophy 2025

డిన్నర్‌ ట్రీట్..
ఈ మ్యాచ్ లో.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తన చేతికి వచ్చిన క్యాచ్‌ ను నేలపాలు చేశాడు రోహిత్ శర్మ. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్‌ కూడా మిస్‌ అయింది. దీనిపై మ్యాచ్ సమయంలో క్షమాపణలు చెప్పిన రోహిత్.. మళ్లీ దాని గురించి మాట్లాడాడు. "రేపు డిన్నర్‌కి అక్షర్ ను తీసుకెళ్తాను. అది చాలా ఈజీ క్యాచ్. నేను ఆ క్యాచ్ ను పట్టుకోవాల్సింది. హృదోయ్, జాకీర్‌ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇకపోతే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ పిచ్‌ ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేను. కానీ నాకు తెలిసి దాదాపు ఇలానే ఉండొచ్చు. అయినా పిచ్‌ ఎలా ఉంటుందో చెప్పడానికి నేనేం క్యూరెటర్ కాదు కదా." అని రోహిత్ చెప్పాడు.

Story first published: Friday, February 21, 2025, 7:41 [IST]
Other articles published on Feb 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+