Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohith Sharma: పదే పదే పిచ్ పైకి లబుషేన్.. రోహిత్ ఫైర్(Video)

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య నాలుగో టెస్ట్ జరుగుతోంది. మొదటి రోజు పిచ్‌పై పరుగెత్తినందుకు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్త చేశాడు. దీనిపై ఎంపైర్లు చర్య తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. బ్యాటర్లు, ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా పిచ్ రక్షిత ప్రదేశంలో పరిగెత్తడం వల్ల ఉపరితలం దెబ్బతింటుంది. ఇది బౌలర్‌కు ఇబ్బంది కలిగిస్తుంది.

రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘించిన జట్టు ఐదు పరుగుల పెనాల్టీతో కట్టాల్సి ఉంటుంది. ఎంసీసీ చట్టం 41.14 ప్రకారం పిచ్‌ను దెబ్బతీసే బ్యాటర్‌ల గురించి వివరిస్తుంది. పిచ్‌కు ఉద్దేశపూర్వకంగా లేదా నివారించదగిన నష్టం కలిగించడం నిబంధనలకు విరుద్ధమని ఈ నిబంధన వివరిస్తుంది. స్ట్రైకర్ బంతిని ఆడటం లేదా ఆడటంలో రక్షిత ప్రదేశంలోకి ప్రవేశిస్తే అక్కడి నుంచి వెంటనే కదలాలి. లేకుంటే ఎంపైర్లు చర్య తీసుకోవాల్సి ఉంటుంది.

Rohit Sharma objected to Aussie batsman Labuschagne repeatedly coming onto the pitch during the ongoing Test in Melbourne

కాగా ఇదే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్‌లో తప్పిదం చేసిన జైస్వాల్ మందలించాడు. మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేసేందుకు రోహిత్ సిల్లీ పాయింట్‌లో యశస్విని పెట్టి పెట్టి స్పిన్నర్లతో బౌలింగ్ వేయించాడు. జైస్వాల్ పదే పదే జంప్ చేశాడు. దీంతో రోహిత్ 'ఓయ్ జైస్వాల్.. గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? అతను బాల్ ఆడకముందే జంప్ చేస్తున్నావ్? అలా చేయకు అని అన్నాడు. ఇది అక్కడున్న మైక్ లో రికార్డు అయింది.

మెల్ బోర్న్ మ్యాచ్ మొదటి రోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. సామ్ కోన్ స్టాస్ 60 పరుగులు చేశాడు. ఖవాజా 57 పరుగులు, మార్నస్ లబుషేన్ 72 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 4 పరుగులు చేయగా.. అలెక్స్ క్యారీ 31 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ 68, ప్యాట్ కమ్మిన్స్ 8 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్, రవింద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, December 26, 2024, 17:30 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+