Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ షాట్‌ ఆడకుండా కంట్రోల్ చేసుకోవాలి.. టీమిండియా కెప్టెన్‌కు మాజీ లెజెండ్ సలహా!

 Rohit Sharma needs to control his pull shot says Sunil Gavaskar

ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో అత్యధిక విజయాలు సాధించిన భారత్.. టేబుల్ టాపర్‌గా సెమీస్‌లో అడుగు పెట్టింది. టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్వపు ఫామ్ అందుకోవడం జట్టుపై నమ్మకం పెంచుతోంది. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన అప్రోచ్‌తో పరుగులు చేస్తున్నాడు. వీళ్లకు తోడు బౌలింగ్ యూనిట్ కూడా రాణిస్తోంది.

తడబడుతున్న రోహిత్..

తడబడుతున్న రోహిత్..

టీమిండియా రాణిస్తున్నప్పటికీ అభిమానులను ఆందోళన పరుస్తున్న అంశం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. రెండు మ్యాచుల క్రితం వరకు కేఎల్ రాహుల్ కూడా ఫామ్‌లో లేడు. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టచ్ అందుకున్న రాహుల్.. జింబాబ్వే మ్యాచ్‌లో కూడా రాణించాడు. కానీ రోహిత్ పరిస్థితి అలా లేదు. నెదర్లాండ్స్‌పై అతను ఆడిన 53 పరుగుల ఇన్నింగ్స్ ఒక్కటే చెప్పుకోదగింది. దానిలో కూడా అతనికి పలుమార్లు జీవనదానం లభించింది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా 4, 53, 15, 2, 15 పరుగులు చేశాడు.

ఆ షాట్‌తోనే ప్రాబ్లం..

ఆ షాట్‌తోనే ప్రాబ్లం..

రోహిత్ ఫేవరెట్ షాట్ పుల్ షాట్. ఇప్పుడు అదే అతని కొంపు ముంచుతోంది. ఆస్ట్రేలియాలోని భారీ బౌండరీలను సులభంగా క్లియర్ చేయడం కష్టం. దీంతో షార్ట్ బాల్స్‌ను పుల్ చేయడంలో తడబడుతున్న రోహిత్ పెవిలియన్ చేరుతున్నాడు. ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ చూడా చెప్పాడు. రోహిత్ ఈ షాట్ ఆడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, మిగతా షాట్లపై ఫోకస్ పెట్టాలని సూచించాడు.

క్రీజులో ఉంటే బెటర్..

క్రీజులో ఉంటే బెటర్..

పుల్‌తో రోహిత్ ఎన్నో పరుగులు చేసినా.. అదే అతనికి మైనస్‌గా మారిందని గవాస్కర్ అన్నాడు. 'రోహిత్ వంటి బ్యాటర్ 10 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే జట్టు 80-90 పరుగుల స్కోరు చేయగలుగుతుంది. అతను ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి. పవర్ ప్లేలో ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్‌ను ఉపయోగించుకోవాలని ఎక్కువ భారీ షాట్లు ఆడే పద్ధతిని రోహిత్ పరిచయం చేశాడు. దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తూ అవుటవుతున్నాడు. చివరి రెండు మ్యాచుల్లో అయినా రోహిత్ ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నా' అని సన్నీ చెప్పాడు.

Story first published: Tuesday, November 8, 2022, 13:36 [IST]
Other articles published on Nov 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+