For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు జట్టులో రోహిత్, మురళీ, పార్థీవ్: కారణం వెల్లడించిన ఎమ్మెస్కే

 Rohit Sharma, Murali Vijay, Parthiv Patel included in Test squad for Australia Tour - MSK Prasad explains why

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో డిసెంబరు 6 నుంచి జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు శుక్రవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 18 మందితో కూడిన ఈ జట్టులో పార్థీవ్ పటేల్, రోహిత్ శర్మతో పాటు మురళీ విజయ్‌లకు చోటు కల్పించడాన్ని క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత మళ్లీ టెస్టుల్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చివరిసారిగా భారత్ తరుపున ఈ ఏడాది జనవరిలో అడాడు. మురళీ విజయ్ విషయానికి వస్తే కాస్త ఫరవాలేదు.

ఇంగ్లాండ్ పర్యటనలో మురళీ విజయ్ విఫలం

ఇంగ్లాండ్ పర్యటనలో మురళీ విజయ్ విఫలం

ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో అతను ఫెయిలవడంతో.. అతడ్ని తప్పించిన సెలక్టర్లు యువ ఓపెనర్ పృథ్వీ షా‌కి అవకాశమిచ్చారు. వెస్టిండిస్‌తో ఇటీవలే ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పృథ్వీ షా తన అరంగేట్ర టెస్టులోనూ సెంచరీతో సత్తాచాటాడు. రెండో టెస్టులో సైతం హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ ముగ్గురి ఎంపికపై ఎమ్మెస్కే ప్రసాద్ ఇలా

దీంతో ఓపెనర్‌గా మురళీ విజయ్ ఇప్పట్లో పునరాగమనం చేయడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకి మురళీ విజయ్‌ని సెలక్టర్లు ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. హనుమ విహారికి మరో అవకాశం దక్కింది. ఈ ముగ్గురి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు.

రోహిత్ శర్మ బ్యాక్‌ఫుట్‌పై చాలా బాగా ఆడతాడు

"ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత కఠినంగా శ్రమించిన మురళీ విజయ్ ఫామ్ అందుకున్నాడు. అందుకే అతడ్ని ఎంపిక చేశాం. ఇక రోహిత్ శర్మ గురించి చెప్పాలంటే.. అతను బ్యాక్‌ఫుట్‌పై చాలా బాగా ఆడతాడు. ఆస్ట్రేలియా పిచ్‌లకి రోహిత్ ఆట బాగా సరిపోతుంది. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో పార్థీవ్ పటేల్ బ్యాట్‌తో మెరుగ్గా రాణించాడు. ఇలా ముగ్గురూ ఇటీవల ఫామ్‌ని చాటుకోవడంతో ఆస్ట్రేలియా పర్యటనకి ఎంపిక చేశాం" అని అన్నాడు.

కీపర్లుగా పంత్, పార్ధీవ్ పటేల్

ఆస్ట్రేలియా సిరిస్‌లో రిషబ్ పంత్‌తో పాటు పార్థివ్‌ పటేల్‌ కీపర్లుగా వ్యవహరించనున్నాడు. నవంబరు 21న ఆరంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. దీంతో పాటు న్యూజిలాండ్ ఎతో 15 మందితో భారత్ ఎ జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు:

కోహ్లీ (కెప్టెన్‌), మురళీ విజయ్‌, రాహుల్‌, పృథ్వీ షా, పుజారా, రహానె, హనుమ విహారి, రోహిత్‌, పంత్‌, పార్థివ్‌ పటేల్‌, అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, షమీ, ఇషాంత్‌, ఉమేష్‌, బుమ్రా, భువనేశ్వర్‌.

Story first published: Saturday, October 27, 2018, 16:44 [IST]
Other articles published on Oct 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+