For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకులు: టాప్-5లో రోహిత్ శర్మ, కోహ్లీ నెంబర్ వన్

Rohit Sharma moves up to fifth in ICC ODI rankings

హైదరాబాద్: మొహాలీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ద్విశతకం బాదిన రోహిత్ శర్మ మరో జాక్‌పాట్ కొట్టేశాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగుల్లో టాప్ 5లో ఒకడిగా నిలిచాడు. ఇదిలా ఉండగా టాప్ 1గా భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. రెండో ర్యాంకర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివీలియర్స్ కోహ్లీ కంటే నాలుగు పాయింట్లు తక్కువలో ఉన్నాడు. మూడో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ నిలిచాడు.

డిసెంబరు 17వరకు జరిగిన భారత్ శ్రీలంక వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా చేసిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన రోహిత్ సేన రెండో వన్డేలో తన సత్తా ఏంటో నిరూపించింది. ఈ మ్యాచ్ రోహిత్ రెండు సెంచరీలు చేశాడు. ఇప్పటికీ రోహిత్‌ మూడోసారి డబుల్ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. మూడు వన్డేల్లో భారత్ 2-1తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.

మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న శిఖర్ ధావన్‌కు కూడా ఈ ర్యాంకింగ్‌లో 14 వ స్థానం దక్కింది. ఈ ర్యాంకింగ్‌లలో స్పిన్నర్ బౌలర్ అయిన యజువేంద్ర చాహల్‌కు 23వ స్థానం దక్కింది. విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డేలో మ్యాన్ ఆప్ ద మ్యాచ్‌ పొందిన కుల్‌దీప్ యాదవ్ 16వ స్థానాలు ముందుకు వచ్చి 56వ స్థానంలో ఉన్నాడు. పాండ్యా పది ర్యాంకులు ముందుకు దూకి 45వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్
ర్యాంకు జట్టు మ్యాచ్‌లు పాయింట్లు రేటింగ్
1 South Africa 53 6386 120
2 India 56 6680 119
3 Australia 52 5948 114
4 England 54 6156 114
5 New Zealand 49 5432 111
6 Pakistan 46 4560 99
7 Bangladesh 34 3114 92
8 Sri Lanka 67 5630 84
9 West Indies 40 3077 77
10 Zimbabwe 41 2129 52

ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్
ర్యాంకు జట్టు మ్యాచ్‌లు పాయింట్లు రేటింగ్

1 V. Kohli IND 876
2 A.B. de Villiers SA 872
3 D.A. Warner AUS 865
4 Babar Azam PAK 846
5 R.G. Sharma IND 816
6 Q. de Kock SA 808
7 J.E. Root ENG 802
8 F. du Plessis SA 773
9 H.M. Amla SA 766
10 K.S. Williamson NZ 760

ఐసీసీ బౌలర్స్ ర్యాంకింగ్స్
ర్యాంకు జట్టు మ్యాచ్‌లు పాయింట్లు రేటింగ్
1 Hasan Ali PAK 759
2 Imran Tahir SA 743
3 J.J. Bumrah IND 729
4 J.R. Hazlewood AUS 714
5 K. Rabada SA 708
6 M.A. Starc AUS 684
7 T.A. Boult NZ 671
8 Rashid Khan AFG 649
9 S.P. Narine WI 646
9 L.E. Plunkett ENG 646

ఐసీసీ ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్
ర్యాంకు జట్టు మ్యాచ్‌లు పాయింట్లు రేటింగ్
1 Mohammad Hafeez PAK 353
2 Shakib Al Hasan BAN 346
3 A.D. Mathews SL 321
4 Mohammad Nabi AFG 316
5 B.A. Stokes ENG 293
6 J.P. Faulkner AUS 280
7 J.O. Holder WI 273
8 Moeen Ali ENG 268
9 M.J. Santner NZ 261
10 M.R. Marsh AUS 260

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 15:03 [IST]
Other articles published on Dec 18, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+