ఈ ప్రపంచకప్‌లో బద్దలయ్యే ఆల్ టైమ్ వరల్డ్‌కప్ రికార్డులివే!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. మరో 3 మ్యాచ్‌ల్లో ఈ ప్రపంచకప్ విజేత ఎవరో తెలిసిపోతుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో.. లంకపై గెలిచిన భారత్ పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ (11 పాయింట్లు)తో మంగళవారం మొదటి సెమీఫైనల్ పోరుకు భారత్ సిద్ధమైంది. లీగ్ దశను రెండో స్థానం (14 పాయింట్లు)తో ముగించిన ఆస్ట్రేలియా.. మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ (12)తో గురువారం రెండో సెమీఫైనల్లో తలపడనుంది.
గ్రూపు స్టేజిలో ఇప్పటికే మనం ఎన్నో అద్భుతమైన ప్రదర్శలతో పలు రికార్డులు బద్దలయ్యాయి. టోర్నీలో భాగంగా జరిగే మిగతా మూడు మ్యాచ్‌ల్లో మరికొన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఒక్కసారి చూద్దాం...!
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు - 673
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేశాడు. టీమిండియా ఫైనల్ వరకు వెళ్లిన ఈ టోర్నీలో సచిన్ సెంచరీతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు చేశాడు. సచిన్ నమోదు చేసిన ఈ అత్యధిక పరుగుల రికార్డు 16 ఏళ్ల వరకు అలాగే ఉంది. అయితే, 2007 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్(659) పరుగులతో సచిన్ రికార్డుకి చేరువగా వచ్చినప్పిటికీ బద్దలు కొట్టలేకపోయాడు. అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఈ రికార్డు బద్దలయ్యేలా కనిపిస్తోంది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో 27 పరుగులు చేస్తే సచిన రికార్డు బద్దలవడం ఖాయం. అలా కాకుండా 53 పరుగులు చేస్తే ఒక ప్రపంచకప్‌లో 700 పరుగుల మార్కుని అందుకున్న తొలి క్రికెటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడు.
అత్యధిక ప్రపంచకప్ సెంచరీలు - 6
6 సెంచరీలతో ఈ జాబితాలో రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్‌లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో సెంచరీ చేస్తే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ సైతం 4 సెంచరీలతో ఈ రికార్డు రేసులో ఉన్నాడు. అయితే, సచిన్-రోహిత్ శర్మల రికార్డుని సమం చేయాలంటే వార్నర్ మరో 2 సెంచరీలు చేయాల్సి ఉంటుంది.
అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ - 11
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఫీల్డర్లు పట్టిన ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లను మనం చూశాం. ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్ 11 క్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌లో జో రూట్ మరో క్యాచ్ పడితే ఒక ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
ప్రపంచకప్‌లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్ - 21
ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అగ్రస్థానంలో ఉన్నాడు. అలెక్స్ క్యారీ ఇప్పటివరకు 19 డిస్మిసల్స్(స్టంపింగ్‌లు, క్యాచ్‌లు కలుపుకుని) చేశాడు. మరో 3 డిస్మిసల్స్ చేస్తే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ నెలకొల్పిన 21 డిస్మిసల్స్ రికార్డుని అధిగమిస్తాడు. 2003 ప్రపంచకప్‌లో ఆడమ్ గిల్ క్రిస్ట్ ఈ రికార్డు నెలకొల్పాడు.
{headtohead_cricket_3_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications