నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. సెంచరీ బాదినప్పటికీ.. ఏం జరిగిందంటే!

ప్రపంచ కప్ 2019లో భాగంగా ఇంగ్లండ్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరుపై కన్నేసింది. ఓపెనర్లు రాణించి హాఫ్ సెంచరీలు నమోదు చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. హాఫ్ సెంచరీ చేసి ఓపెనర్ రాహుల్ అవుటవ్వగా.. మరో ఓపెనర్ రోహిత్ తన బ్యాటింగ్ జోరును కొనసాగించి 140 పరుగుల వద్ద అవుటాయ్యాడు. టాప్ గేర్‌లో బ్యాటింగ్ చేస్తున్న రోహిత్‌కు కోహ్లీ సంపూర్ణ సహకారం అందిస్తుండటం గమనార్హం. కెప్టెన్ కోహ్లీ అండతో రోహిత్ డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తుండగా ఓ చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకొన్నాడు. రాహుల్ బ్యాటింగ్ జోరు గురించి మరిన్ని వివరాలు...

వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో
భారత వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటికే వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. ప్రస్తుతం పాక్ జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో డబుల్ సెంచరనీపై కన్నేసినట్టు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 113 బంతుల్లో 140 (14x4, 3x6) పరుగులతో క్రీజులో ఉన్నాడు. రోహిత్ కెరీర్‌లో తన 24వ సెంచరీని ఖాతాలో వేసుకొన్నాడు.

రోహిత్ ఖాతాలో మరో రికార్డు
ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా ఓ ఘనతను సాధించాడు. అంతకుముందు ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ పాక్‌పై సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇక పాకిస్థాన్‌పై వన్డే క్రికెట్‌లో సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా ఘనతను సొంతం చేసుకొన్నాడు. అంతకు ముందు కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ రెండో ఆటగాడిగా రికార్డును సాధించాడు.

మూడు డబుల్ సెంచరీలు ఇలా
ఇప్పటి వరకు రోహిత్ శర్మ పేరిట మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2013లో బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 158 బంతుల్లో 209 (12x4, 6x16) పరుగులు చేశాడు. అనంతరం 2014లో కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 173 బంతుల్లో 264 (33x4, 6x9) పరుగులు చేశాడు. ఆ తర్వాత 2017లో శ్రీలంకపై మొహాలీలో 153 బంతుల్లో 208 (13x4, 6x12) పరుగులు చేశాడు. అయితే ప్రపంచకప్‌లో తొలి డబుల్ సెంచరీ చేస్తారని ఆశించిన క్రికెట్ అభిమానులను నిరాశ పరచడం గమనార్హం.

41 ఓవర్లలో భారత జట్టు స్కోరు
కడపటి వార్తలు అందే సరికి.. భారత జట్టు భారీ స్కోరును సాధించింది. 41 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 254 పరుగులు సాధించింది. రాహుల్ 57 పరుగులు, రోహిత్ శర్మ 140 పరుగులు చేసి అవుటవ్వగా.. కెప్టెన్ కోహ్లీ 45 పరుగులతో, హార్థిక్ పాండ్యా 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరును 350 పరుగులు దాటించేందుకు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.
{headtohead_cricket_3_5}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications