Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsKKR : ముంబైకి షాక్.. రోహిత్ లేడు.. అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం.. పగ్గాలు సూర్యకే!

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు కడుపులో బాగలేదట. ఇన్‌ఫెక్షన్ రావడంతో అతను ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్‌కు ఆ జట్టు పగ్గాలు అందించారు.

ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఎవరికీ అమ్మలేదు. మొత్తమ్మీద 19 వేల సీట్లను ఉచితంగా అమ్మాయిలకు కేటాయించారు. అలాగే డబ్ల్యూపీఎల్ నెగ్గిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా టాస్ సమయంలో మైదానంలో మెరిసింది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సూర్యకుమార్ యాదవ్.. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని ప్రకటించాడు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మారుతుందని, బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని సూర్య చెప్పాడు.

 rohithskyarjun

ఈ కారణంగానే తాము ఛేజింగ్ ఎంచుకున్నామని చెప్పిన అతను.. తమ జట్టులో ఒకే ఒక మార్పు చేశామని చెప్పాడు. జట్టులోకి డువాన్ యాన్సెన్ ఆడుతున్నట్లు చెప్పాడు. అలాగే రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో చెప్పాడు. అంటే, అవసరం అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ ఆడే అవకాశం ఉందన్నమాట. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు.

అదే సమయంలో తాము టాస్ గెలిచినా కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామని కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా చెప్పాడు. తమ బ్యాటింగ్ బలంగానే ఉందని, అయితే బౌలింగ్ విభాగంలో కొంత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని రాణా చెప్పాడు. తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని, ఇక్కడ 180 పరుగులు చేసినా మంచి స్కోరే అనుకుంటున్నానని చెప్పాడు.

ముంబై ఇండియన్స్ : కామెరూన్ గ్రీన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, నేహాల్ వధీరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ యాన్సెన్, రైలీ మెరెడిత్

కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, జగదీశన్, నితీష్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి

Story first published: Sunday, April 16, 2023, 15:31 [IST]
Other articles published on Apr 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+