నా పెళ్లికి రండి: ప్రధాని మోడీకి రోహిత్ శర్మ ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ రోహిత్ శర్మ తన వివాహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. బుధవారంనాడు పార్లమెంటు హౌస్‌లో రోహిత్ ప్రధానిని కలిశారు. డిసెంబర్ 13న తన పెళ్లికి రావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోడీని కలిసిన రోహిత్ శర్మ పుష్పగుచ్ఛం, తన వివాహ శుభలేఖను ఇచ్చారు. రోహిత్ శర్మ వివాహం డిసెంబర్ పదమూడవ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరగనుంది. దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ క్రికెటర్లు ఢిల్లీకి చేరుకున్నారు.

కాగా, ముంబైలోని ఓ స్టార్ హోటల్లో రోహిత్ శర్మ పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి ఇప్పటికే సహచరులకు, మాజీలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఆగస్టులో రోహిత్ శర్మ, రితికాల ఎంగేజ్‌మెంట్ అయింది. ఆరు సంవత్సరాల పాటు రోహిత్ శర్మకు రితిగ మేనేజర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు అతనికి ఇల్లాలు కాబోతుంది.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Rohit invites PM Modi to his wedding
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications