Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: రాజకీయాల్లోకి రోహిత్ శర్మ ?

Rohit Sharma: భారత స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత హిట్ మ్యాన్ మహారాష్ట్ర సీఎంను కలిశాడు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ సమావేశం తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే.

రోహిత్-ఫడ్నవీస్ సమావేశం తర్వాత తలెత్తిన ప్రశ్నలు
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నాడు. సమావేశానికి సంబంధించిన ఫోటోలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఊహాగానాలు పెరిగిపోయాయి. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత క్రికెటర్లు రాజకీయాల వైపు మొగ్గు చూపడం సాధారణమే. మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్ నుంచి నవజ్యోత్ సింగ్ సిద్దూ వరకు, యూసుఫ్ పఠాన్, గౌతమ్ గంభీర్ కూడా రాజకీయాల్లో చేరారు. అయితే గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. మరోవైపు కొన్ని రోజుల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్‌ను బీజేపీలో చేరేలా చేశారు.

Rohit Sharma Meets Maharashtra CM Political Entry on the Cards

ఫోటోలను పంచుకుంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా రాసుకొచ్చారు. "భారత క్రికెటర్ రోహిత్ శర్మను నా అధికారిక నివాసం వరకు స్వాగతించడం, కలవడం, సంభాషించడం చాలా బాగుంది. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ రిటైర్మెంట్, ఆయన ప్రయాణంలోని తదుపరి అధ్యాయంలో విజయం సాధించాలని హిట్ మ్యాన్‌కు శుభాకాంక్షలు తెలియజేశాను." అని రాసుకొచ్చారు.

రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్
రోహిత్ శర్మ టీమిండియా తరఫున 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 67 టెస్ట్ మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ 4301 పరుగులు చేశాడు. అందులో రోహిత్ శర్మ 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ బాదాడు. టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ సగటు 40.58గా ఉంది.

Story first published: Wednesday, May 14, 2025, 11:14 [IST]
Other articles published on May 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+