న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వంద శాతం విన్ రికార్డు: చెపాక్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత

IPL 2019 : Rohit Sharma Maintains 100% Win Record Against Chennai Super Kings At Chepauk | Oneindia
Rohit Sharma maintains 100% win record against CSK at Chepauk with 7th straight win

హైదరాబాద్: చెపాక్ వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ఐదోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరగా... ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

రోహిత్ శర్మ ఏడో విజయాల్లో భాగస్వామిగా

రోహిత్ శర్మ ఏడో విజయాల్లో భాగస్వామిగా

చెపాక్‌లోని ఎమ్‌ఎ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రోహిత్ శర్మ ఏడో విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. దీంతో ఈ స్టేడియంలో రోహిత్ శర్మ వంద శాతం రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ స్టేడియంలో డెక్కన్ ఛార్జర్స్ తరుపున రెండు, ముంబై ఇండియన్స్ తరుపున రోహిత్ శర్మ ఐదు మ్యాచ్‌ల్లో విజయాలను సొంతం చేసుకున్నాడు.

మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఓటమి

మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే ఓటమి

మొత్తం ఏడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కేపై రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహించిన జట్లే విజయం సాధించాయి. ఐపీఎల్ ఆరంభం సీజన్లలో రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ 2013 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 24 మ్యాచ్‌లాడగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది.

2008: Won by seven wickets

2010: Won by 31 runs

2012: Won by eight wickets

2013: Won by nine runs

2015: Won by six wickets

2019: Won by 46 runs

2019: Won by six wickets

చెపాక్‌లో ముంబై ఇండియన్స్ మెరుగైన రికార్డు

చెపాక్‌లో ముంబై ఇండియన్స్ మెరుగైన రికార్డు

చెపాక్ స్టేడియంలో సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్‌ మెరుగైన రికార్డుని కలిగి ఉంది. ఈ స్టేడియంలో ముంబైతో తలపడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట సీఎస్‌కే ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

ముంబైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే ఓటమి

ముంబైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే ఓటమి

అనంతరం సీఎస్‌కే నిర్దేశించిన 132 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ముంబైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సీఎస్‌కే ఓడిపోవడం విశేషం.

Story first published: Wednesday, May 8, 2019, 19:58 [IST]
Other articles published on May 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X